Revanth Reddy: సీఎం రేవంత్‌కు మరో బిగ్ టాస్క్.. ఇవాళ టీపీసీసీ కీలక సమావేశం.. ఆ తర్వాత ఢిల్లీకి.. ఎందుకంటే..
తెలంగాణ సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ముందు మరో సవాల్ ఎదురైంది. మరో నాలుగు నెలలపాటు టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డే కంటిన్యూ అవుతున్న క్రమంలో తెలంగాణలో రానున్న పార్లమెంట్ ఎన్నికల బాధ్యతను రేవంత్‌రెడ్డికే అప్పజెప్పింది కాంగ్రెస్ అధిష్టానం. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను విజయపథంలో నడిపిన రేవంత్ మరోసారి పార్లమెంట్ ఎన్నికల్లో కీలక పాత్రపోషించనున్నారు.

తెలంగాణ సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ముందు మరో సవాల్ ఎదురైంది. మరో నాలుగు నెలలపాటు టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డే కంటిన్యూ అవుతున్న క్రమంలో తెలంగాణలో రానున్న పార్లమెంట్ ఎన్నికల బాధ్యతను రేవంత్‌రెడ్డికే అప్పజెప్పింది కాంగ్రెస్ అధిష్టానం. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను విజయపథంలో నడిపిన రేవంత్ మరోసారి పార్లమెంట్ ఎన్నికల్లో కీలక పాత్రపోషించనున్నారు. ఒకపక్క పార్టీ అధ్యక్షుడుగా మరోపక్క ముఖ్యమంత్రి హోదాలో పార్లమెంట్లో ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించడమే రేవంత్ రెడ్డి ముందున్న బిగ్ టాస్క్. గత ఎన్నికల్లో మూడు ఎంపీ స్థానాలను సొంతం చేసుకున్న కాంగ్రెస్ ఈ సారి ఎన్నికల్లో 17 స్థానాలనూ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో గాంధీభవన్ వేదికగా రేవంత్ అధ్యక్షతన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. పార్లమెంట్ ఎన్నికలు, నామినేటెడ్ పోస్టుల భర్తీపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొననున్నారు.
సంక్రాంతి తర్వాత పార్లమెంట్ ఎన్నికలపై పూర్తిస్థాయిలో ఫోకస్
ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, భువనగిరి, నల్గొండ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యేలు ఏకపక్షంగా గెలవడంతో ఇక్కడ లోక్‌సభ స్థానాలు గెలిచే సూచనలు పార్టీకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఉత్తర తెలంగాణ జిల్లాలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జహీరాబాద్, మెదక్, మల్కాజ్ గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల లో పార్టీ కాస్త బలహీనంగా ఉంది. అయితే ఎలాగూ రాష్ట్రంల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక.. గట్టిగా కృషి చేస్తే కొన్ని స్థానాలు గెలిచే అవకాశం లేకపోలేదు. దీంతో 17 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. సంక్రాంతి తర్వాత సీఎం దావోస్ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో పార్లమెంట్ ఎన్నికల పైన దృష్టి కేంద్రీకరించనున్నారు. 15 స్థానాలు గెలిచేలా కార్యాచరణను రూపొందించనున్నారు రేవంత్.
ఇవాళ రేవంత్ అధ్యక్షతన టీపీసీసీ విస్తృతస్థాయి భేటీ
ఇవాళ గాంధీభవన్‌లో మధ్యాహ్నం పీసీసీ కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించనున్నారు. భేటీకి కాంగ్రెస్ కొత్త ఇంఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు ఏఐసీసీ కార్యదర్శులు హాజరుకానున్నారు. ఇందులో ప్రధానంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ, పార్లమెంట్ ఎన్నికలపై పూర్తి స్థాయిలో చర్చించనున్నారు. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువత జరగనున్న మొదటి పార్టీ సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అనేక అంశాలపై క్షేత్రస్థాయిలో అభిప్రాయాలను సేకరించి.. నివేదికను రూపొందించి రేపు ఢిల్లీలో జరిగే పార్లమెంట్ ఎన్నికల సన్నాహక కమిటీ సమావేశంలో సమర్పించనున్నారు రేవంత్. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల కోసం ఇప్పటికే అన్వేషణ మొదలెట్టింది కాంగ్రెస్. కొంతమంది అభ్యర్థుల పేర్లతోటి సర్వేలు చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. బలమైన అభ్యర్థులు లేని చోట ఇతర పార్టీల నుంచి అభ్యర్థులను తీసుకొని బరిలో దింపాలని ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..