Revanth Reddy: కేటీఆర్ ట్విట్.. క్షమాపణలు చెప్పిన రేవంత్ రెడ్డి.. చివరకు శశి ధరూర్ ఏమన్నారంటే..?
Revanth Reddy apologises Shashi Tharoor: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి ధరూర్‌పై తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. సొంతపార్టీ కీలక నేతపై
Revanth Reddy apologises Shashi Tharoor: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి ధరూర్‌పై తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. సొంతపార్టీ కీలక నేతపై ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి. అయితే.. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్‌ను మంత్రి కేటీఆర్ ట్విట్ చేసి ఆయన్ను ఇరకాటంలో పడేశారు. ఇలాంటి వ్యక్తికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారా..? అంటూ పలు విమర్శలు చేశారు. కావాలంటే.. ఈ ఆడియోను ఫొరెన్సిక్ ల్యాబ్‌కు పంపండి అంటూ పేర్కొన్నారు. కాగా.. ఈ ఆడియో క్లిప్‌పై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ఎంపీ శశిథరూర్‌పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయనపై చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నట్లు రేవంత్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు. శశిథరూర్‌ను తాను అత్యంత గౌరవించే వ్యక్తిననని.. తన వ్యాఖ్యలపై శశిథరూర్‌కు వివరణ ఇచ్చినట్లు వెల్లడించారు.
I spoke to shri @ShashiTharoor ji to convey that I hereby withdraw the remarks and reiterate that I hold my senior colleague in the highest regard. I regret any hurt that may have been caused to him by my words. We share our faith in the values and policies of the Congress Party.
— Revanth Reddy (@revanth_anumula) September 16, 2021
కాంగ్రెస్‌లో అందరం విధానాలు, విలువలతో పనిచేస్తామని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి అందరం కృషిచేస్తామన్నారు. తనపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో శశిథరూర్ కూడా స్పందించారు. రేవంత్‌రెడ్డి చింతిస్తున్నట్లు తెలిపారని, తాను అంగీకరించినట్లు శశిథరూర్ ట్విట్ చేశారు. దురదృష్టవశాత్తు ఈ సంఘటన జరిగిందంటూ ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలోపేతం కావడానికి మేమందరం ఒక్కటిగా కలిసి పనిచేస్తామంటూ కేరళ తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ ట్విట్‌లో వెల్లడించారు. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మణికం ఠాకూర్‌కు కూడా ట్యాగ్ చేశారు. ఈ మేరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సైనికుల్లా పనిచేస్తామంటూ రేవంత్ పేర్కొన్నారు.
I received a gracious call from @revanth_anumula to apologise for what was said. I accept his expression of regret & am happy to put this unfortunate episode behind us. We must work together to strengthen @INCIndia in Telengana & across the country. https://t.co/pwIRmxpipn
— Shashi Tharoor (@ShashiTharoor) September 16, 2021
కాగా.. అంతకుముందు మంత్రి కేటీఆర్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడిన ఆడియోను ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి దీనిలో సొంత పార్టీ నేత, ఎంపీ శశిథరూర్‌పై పలు కామెంట్లు చేశారు. ఈ ఆడియోను ట్వీట్టర్ లో పంచుకున్న మంత్రి కేటీఆర్.. దీనిపై రేవంత్ రెడ్డి స్పందించాల్సిన అవసరం లేదని కామెంట్ చేశారు. ఈ ఆడియోను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తే మేలంటూ.. రాహుల్ గాంధీ ట్యాగ్ చేస్తూ పలు కామెంట్లు చేశారు. దీనిపై రేవంత్ రెడ్డి ట్విట్ ద్వారా వివరణ ఇస్తూ.. పుట్టుకతోనే అబద్ధాలకోరు అయిన కేటీఆర్.. రాష్ట్రంలోని పరిణామాలు, తన కుటుంబంపై అవినీతి ఆరోపణల నుంచి దృష్టి మరల్చేందుకే ఈ ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
Also Read: