Free Bus: తెల్లరేషన్ కార్డు ఉంటేనే ఉచిత బస్సు ప్రయాణం.. ఎమ్మార్వోకు వినతులు అందజేత..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదలు మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించింది. ఆ సదుపాయాన్ని ముందుగా మహిళలందరికీ వర్తింపజేశారు. కొన్ని రోజుల తరువాత స్థానిక గుర్తింపు కార్డు ఉన్న వారికి మాత్రమే జీరో టికెట్ ఇచ్చేలా ఆదేశాలు జారీ చేశారు. దీంతో కొందరు తమ ప్రయాణ అర్హతను కోల్పోయారు. దీంతో కొంత మేర రద్దీని నియంత్రించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదలు మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించింది. ఆ సదుపాయాన్ని ముందుగా మహిళలందరికీ వర్తింపజేశారు. కొన్ని రోజుల తరువాత స్థానిక గుర్తింపు కార్డు ఉన్న వారికి మాత్రమే జీరో టికెట్ ఇచ్చేలా ఆదేశాలు జారీ చేశారు. దీంతో కొందరు తమ ప్రయాణ అర్హతను కోల్పోయారు. దీంతో కొంత మేర రద్దీని నియంత్రించారు. ఇప్పుడు ఇలాంటి ప్రతిపాదననే బాల్కొండలో తీసుకొచ్చారు. తెల్లరేషన్ కార్డు ఉన్న మహిళలకే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలని స్థానిక ఎమ్మార్వోను కోరారు.
ధర్మ సమాజ్ పార్టీ నాయకులు ఈ రూల్ కచ్చితంగా అమలు చేయాలని వినతి పత్రం అందజేశారు. దీంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య తగ్గుతుందని భావిస్తున్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్లు తమ జీవనోపాధిని కోల్పోయారని తెలిపారు. అందుకుగాను ప్రతి ఆటో డ్రైవర్‌కు భృతి కింద నెలకు రూ. 3000 ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మార్వోకు వివరించారు. ఈ కార్యక్రమంలో సమాజ్ పార్టీ మండల కన్వీనర్ నిశాంత్ మహారాజ్ తో పాటూ లీడర్లు ఆత్మ గౌరవ్, క్రాంతి కిరణ్, నితీష్, తరుణ్, కార్తీక్ పాల్గొన్నారు.
ఇదిలా ఉంటే మహిళలకు ఉచిత ప్రయాణం అనగానే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు కదంతొక్కారు. తమ బంధువుల ఇంటికి, షాపింగులకు, పుణ్యక్షేత్రాలకు ప్రయాణం చేశారు. దీంతో ఏ బస్సు చూసినా కిక్కిరిసిన జనంతో నిండుగా కనిపిస్తోంది. అవసరమైన వారికి బస్సులు అందుబాటులో ఉండటం లేదు. అందుకే అద్దె బస్సులు నడిపేందుకు ఎవరైనా ఆసక్తి ఉంటే దరఖాస్తు చేసుకోవాలని పత్రికా ప్రకటన కూడా విడుదల చేసింది టీఎస్ఆర్టీసీ.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..