AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సైఫ్ అలీఖాన్‌పై దుండగుడి దాడి.. కరీనా ఎలా తప్పించుకుందంటే?

సైఫ్ అలీఖాన్‌పై దుండగుడి దాడి.. కరీనా ఎలా తప్పించుకుందంటే?

Samatha J
|

Updated on: Jan 19, 2025 | 2:09 PM

Share

బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడ్డాడు ఓ దుండగుడు. అతనిపై కత్తితో దాడికి పాల్పడటంతో తీవ్రగాయాలపాలైన సైఫ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ దాడి జరిగిన సమయంలో ఇంట్లో సైఫ్ అలీఖాన్ పిల్లలతో ఉన్నాడని తెలుస్తోంది. కరీనా కపూర్ బుధవారం రాత్రి కరిష్మా కపూర్, సోనమ్ కపూర్, రియా కపూర్‌లతో కలిసి ఓ పార్టీకి వెళ్లింది. కరీనా కపూర్ కూడా సోషల్ మీడియాలో పార్టీ ఫోటోను షేర్ చేసింది. దానికి ‘గర్ల్స్’ నైట్ ఇన్’ అని క్యాప్షన్ పెట్టింది. దీనిని బట్టి దాడి జరిగినప్పుడు ఆమె ఇంట్లో లేదని తెలుస్తోంది. ఒక వేళ ఇంట్లోనే ఉండి ఉంటే సైఫ్ తో పాటు కరీనాకు కూడా ముప్పు ఏర్పడి ఉండేది. కాగా గురువారం తెల్లవారుజామున సైఫ్ ఇంట్లో చోరీ యత్నం జరిగింది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సైఫ్ అలీఖాన్ ఇల్లు, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.ముంబైలోని బాంద్రాలోని సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి తెల్లవారుజామున ఓ దొంగ ప్రవేశించాడు. అతడి రాకను గుర్తించిన ఇంటి పని మనుషులు పట్టుకునేందుకు ప్రయత్నించారు.

 ఈ గొడవతో సైఫ్ అలీఖాన్ లేచి అక్కడికి చేరుకున్నాడు. ఆపై అడ్డుకునేందుకు వెళ్లిన సైఫ్‌పై దొంగ దాడి చేశాడు. దీంతో నటుడి వీపు భాగంతో పాటు ఆరు చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. సైఫ్ అలీఖాన్ వీపు ఎముక దగ్గర లోతైన గాయం కావడంతో వైద్యులు శస్త్ర చికిత్స చేస్తున్నారు. మరోవైపు సైఫ్ అలీఖాన్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో సైఫ్ అలీఖాన్‌కు శస్త్రచికిత్స జరిగింది. సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో ఇంటి పనివాళ్లపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నటుడి ఇంటికి రెండు ద్వారాలు ఉన్నాయి. నలుగురు గార్డులు పనిచేస్తున్నారు. అయితే ఆ దొంగ ఎలా వచ్చాడన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇంట్లో ఎవరైనా సహాయం చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసును విచారించేందుకు ముంబై పోలీసులు 7 బృందాలను ఏర్పాటు చేశారు. వివిధ కోణాల్లో విచారణ కొనసాగుతోంది. కాగా సైఫ్ అలీఖాన్‌ పై జరిగిన దాడిపై శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది స్పందించారు. మహాయుతి పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు విఫలమయ్యాయని ఆరోపించారు. ముంబయిలో ప్రముఖులపై వరుసగా దాడులు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవట్లేదని ప్రియాంక మండిపడ్డారు. నటుడు సైఫ్‌ అలీఖాన్‌ వంటి సెలబ్రిటీలకే రక్షణ లేకపోతే.. ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

Follow Us