రూ.100 కోట్లు కొల్లగొట్టిన డాకు..బాలయ్యే కింగ్ ఆఫ్ సంక్రాంతి!
నందమూరి నటసింహం బాలకృష్ణ 'డాకు మహారాజ్'తో థియేటర్లలో సందడి చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజైన ఈ సినిమా భారీ విజయం దక్కించుకుంది. ఈ క్రమంలోనే బాక్సాఫీస్ వద్ద డాకు మహారాజ్ కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే భారీ స్థాయిలో వసూళ్లు అందుకున్న ఈ సినిమా, ఇప్పుడు మరో మైలురాయి చేరుకుంది. ఈ సినిమా రూ.100 కోట్ల మార్క్ దాటినట్లు మేకర్స్ వెల్లడించారు. రిలీజైన 4 రోజుల్లోనే ఇంత భారీ స్థాయిలో వసూళ్లు రావడంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా ‘కింగ్ ఆఫ్ సంక్రాంతి’ అంటూ ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అలాగే ఈ మూవీని రేపు తమిళంలోనూ విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘సంక్రాంతి బ్లాక్ బస్టర్ డాకు మహారాజ్ 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.105 కోట్లు వసూల్ చేసింది’ అంటూ మేకర్స్ ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా డాకు మహారాజ్ రూ.105 కోట్ల గ్రాస్ సాధించింది. ఇక ‘డాకు మహారాజ్’కు మొదటి రోజైన ఆదివారం నాడు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.56 కోట్లకు పైగా వసూళ్లు రావడంతో బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ రాబట్టిన సినిమాగా నిలిచింది. సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ బాణీలు అందించారు. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్, ఊర్వశి రౌతేలా, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలుగా నటించారు.
మరిన్ని వార్తల కోసం :
సైఫ్ అలీఖాన్‌పై దుండగుడి దాడి.. కరీనా ఎలా తప్పించుకుందంటే?
జంధ్యాలను గుర్తు చేస్తున్న అనిల్ రావిపూడి!
కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన నవ జంట.. అంతలోనే..
రెండు నెలల ఆపరేషన్ సక్సెస్.. బోనులో చిక్కిన మ్యాన్ ఈటర్
అమావాస్య వేళ పచ్చని పొలంలో క్షుద్ర పూజలు.. ఏం జరిగిందంటే
చలి వణికిస్తుంటే.. ఈ ఆటో డ్రైవర్ మాస్టర్ ప్లాన్ చూశారా?
కొడుకు సమాధి వద్ద సీసీ కెమెరా ఏర్పాటు.. ఎందుకో తెలిస్తే..
సముద్ర తీరంలో ఊహించని అతిథి.. అంతలోనే
అల్లుడితో కలిసి భర్తను చంపిన అత్త.. కారణం మీరనుకున్నదేనా ??
