సైఫ్ ఇంట్లోకి దొంగ ఎలా వచ్చాడంటే..? వీడియో
ఇంట్లోకి చొరబడి కత్తితో దుండగుడు దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. తెల్లవారుజామున సైఫ్ ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు చోరీకి యత్నించాడు. అడ్డుకునే ప్రయత్నం చేసిన సైఫ్‌పై కత్తితో దాడిచేసి పారిపోయాడు. ఈ ఘటనలో సైఫ్ శరీరంపై ఆరు చోట్ల గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను లీలావతి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఎంతోమంది అగ్ర నటులు, సెలబ్రిటీలు నివసించే బాంద్రావెస్ట్‌లోని 12 అంతస్తుల భవనంలో భార్య కరీనా కపూర్, కుమారులతో కలిసి సైఫ్ ఉంటున్నాడు. సైఫ్ నివాసం నాలుగు అంతస్తుల్లో ఉంది. సైఫ్ ఇంటిని దోచుకోవాలన్న ఉద్దేశంతో నిందితుడు ఇంటి వెనకున్న మెట్ల మార్గం ద్వారా లోపలికి ప్రవేశించాడు. ఫైర్ ఎగ్జిట్ ద్వారా నిందితుడు లోపలికి ప్రవేశించినట్టు పోలీసులు తెలిపారు.
సైఫ్ ఇంట్లోన పని మనిషి తెల్లవారుజామున 2 గంటల సమయంలో దుండగుడిని గుర్తించింది. వెంటనే అరుస్తూ సైఫ్‌ను అప్రమత్తం చేసింది. మేల్కొన్న సైఫ్ దొంగను పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఇద్దరూ తలపడ్డారు. దీంతో తప్పించుకునే ప్రయత్నంలో నిందితుడు ఆరుసార్లు సైఫ్‌పై కత్తితో దాడిచేశాడు. దుండగుడు వెనక మార్గం నుంచి రావడం, అదే మార్గం నుంచి తప్పించుకోవడం సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఈ మొత్తం ఘటనలో సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సెలబ్రిటీలు ఉండే భవనం వద్ద అప్రమత్తంగా ఉండాల్సిన సెక్యూరిటీ గార్డులు ఏమయ్యారని, దుండగుడిని వారు ఎందుకు గుర్తించలేకపోయారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సైఫ్‌కు ఎలాంటి ప్రమాదం లేదని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని లీలావతి ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఎడమ చేతికి రెండు బలమైన గాయాలు ఉన్నాయని, మెడపైనా కత్తి గాయం అయినట్టు చెప్పారు. వాటికి ప్లాస్టిక్ సర్జరీలు చేసినట్టు తెలిపారు. నిందితుడిని గుర్తించామని, అతడి కోసం పలు బృందాలు గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
మరిన్ని వార్తల కోసం :
భయాందోళనలో బాలీవుడ్.. అక్కడ అసలేంజరుగుతోంది! వీడియో
సైఫ్ అలీఖాన్‌పై దుండగుడి దాడి.. కరీనా ఎలా తప్పించుకుందంటే?
కాగితాల్ని కాల్చేస్తున్న నీళ్లు..ఏంటీ మిస్టరీ..?
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
