కాగితాల్ని కాల్చేస్తున్న నీళ్లు..ఏంటీ మిస్టరీ..?
భారతదేశం ఎన్నో వింతలు, విశేషాలకు నిలయం. నీరు నిప్పును పుట్టించే ప్రదేశం ఒకటి ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇంతకూ ఆ ప్రదేశం ఎక్కడుంది..? ఈ ప్రచారం నిజమేనా? తెలుసుకుందాం. నీరు మంటలను ఆర్పేస్తుంది. అది దాని సహజ స్వభావం. అయితే ఇక్కడ మాత్రం నీరు మంటలను పుట్టిస్తుంది. చేతి పంపు నుంచి వస్తోన్న నీటి వద్ద కొందరు యువకులు కాగితం ముక్కలను పెట్టగా.. అవి మంటలకు కాలిపోతుండటాన్ని వీడియోలో గమనించొచ్చు. 2025 జనవరి 12న పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్‌గా మారింది.
మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా జిల్లాలో పచ్‌మడి అనే హిల్ స్టేషన్ ఉంది. అలాగే డోక్రీ ఖేడా డ్యామ్‌కు కొద్ది కిలోమీటర్ల దూరంలోని అనాహోని గ్రామంలో అనాహోని కుండ్ ఉంది. ఇది సత్పురా టైగర్ రిజర్వ్ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ వేడి నీటి కుండ్ ఉంది. ఇందులో స్నానం చేస్తే చర్మ సమస్యలు తగ్గిపోతాయని జనం నమ్ముతారు ఇక్కడకు వచ్చిన వారు స్నానాలు కూడా చేస్తారు. ఇక్కడి చేతి పంపు నుంచి వేడి నీరు ధారగా ఉబికి వస్తోంది. ఇక్కడ సల్ఫర్ అధికంగా ఉండటంతో.. నీరు బయటకు వస్తోన్న చోట కాగితం పెడితే..అది కాలిపోతుంది. సల్ఫర్ గాలితో చర్యకు లోనైనప్పుడు మంటలు వస్తాయి. సల్ఫర్‌కు ఆక్సిజన్ తగిలినప్పుడు అది ఆక్సీకరణ చెందుతుంది. ఫలితంగా అక్కడ ఉంచిన కాగితం మండుతుంది. అనాహోనిలో నీరు సాధారణం కంటే వెచ్చగా ఉండటానికి ఇక్కడి సల్ఫర్ శిలలే కారణం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సో.. చేతి పంపులో నుంచి వచ్చే నీరు మంటను పుట్టిస్తోందంటూ సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారం నిజమే. ఈ ప్రాంతంలో సల్ఫర్ నిల్వల వల్లే ఇలా జరుగుతోంది.
మరిన్ని వార్తలకోసం :
రష్యా సైన్యంలో పని చేస్తున్న భారతీయుడు మృతి.. అసలు కథ ఇది!
కుంభమేళాలో సాధువుకు ఆగ్రహం తెప్పించిన యూట్యూబర్..సీన్ కట్ చేస్తే..
సంక్రాంతి పండుగ చేసుకోని ఏకైక గ్రామం.. ఆరోజు స్నానం కూడా చేయరట!

సింహం వేట మామూలుగా లేదు అమాంతం గాల్లోకి ఎగిరి మరీ

కుంభమేళాలో ఛార్జింగ్ తో గంటకు రూ.1000 సంపాదిస్తున్న యువకుడు..

బాయ్ ఫ్రెండ్ బ్లాక్ చేసాడని 100 డైల్ చేసిన గర్ల్ ఫ్రెండ్..

భార్య కోసం వెతికి ఆసుపత్రిలో చేరి భర్త.. సీన్ కట్ చేస్తే..

భర్త కాదు ఉన్మాది..సూసైడ్ చేసుకున్న ఓ ఇల్లాలి కథ వీడియో

దారుణం కత్తితో పొడిచి, యాసిడ్ పోసిన యువకుడు..వీడియో

రూ.7.8 కోట్ల ప్యాకేజీతో ప్రమోషన్, కానీ జీవితం కోల్పోయిన టెకీ ..
