Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చైనా వైరస్ ఎఫెక్టేనా? 13 మంది చిన్నారులు మృతి!

చైనా వైరస్ ఎఫెక్టేనా? 13 మంది చిన్నారులు మృతి!

Samatha J

|

Updated on: Jan 18, 2025 | 7:48 PM

కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా ప్రపంచం బయటపడింది అనుకుని ఊపిరి పీల్చుకునేలోపే HMPV అనే పేరుతో ఓ వైరస్ మళ్లీ చైనా నుంచి విడుదలైంది. గత వారం ఈ వైరస్ మనదేశంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ వైరస్ కనుగొని చాలా సంవత్సరాలు అయినప్పటికీ చైనాలో ఇటీవల ఈ వైరస్ కారణంగా కేసులు పెద్ద సంఖ్యలో నమోదువుతున్నట్లు వస్తున్న వార్తలు అందరినీ టెన్షన్ పెడుతున్నాయి. ముఖ్యంగా ఇది చిన్నపిల్లలపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెప్తుండటంతో ప్రభుత్వాలు కూడా అప్రమత్తం అయ్యాయి. జమ్ము కశ్మీర్ లోని రాజౌరీ జిల్లాలో అంతుచిక్కని వ్యాధితో చిన్నారులు మృత్యువాత పడుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది.

ఇటీవల మరో చిన్నారి కూడా వ్యాధి ఏమిటో తెలియకుండానే మరణించడంతో, ఇప్పటిదాకా ఈ మిస్టరీ జబ్బుతో ప్రాణాలు విడిచిన చిన్నారుల సంఖ్య 13కి పెరిగింది. డిసెంబరు 24 నుంచి ప్రాణాలు తీస్తున్న ఈ వ్యాధితో ఒక్క బధాల్ గ్రామంలోనే అత్యధికంగా చిన్నారులు మరణించారు. దాంతో, బధాల్ గ్రామంలో ప్రజలు హడలిపోతున్నారు. ఈ జబ్బు బారినపడిన పిల్లలను స్థానిక ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నప్పటికీ ఫలితం లేకుండాపోతోంది. అధిక జ్వరం, తీవ్రంగా చెమటలు పట్టడం, వాంతులు, కొన్ని సందర్భాల్లో స్పృహ కోల్పోతుండడం… ఈ మిస్టరీ వ్యాధి లక్షణాలు. దీనిపై రాజౌరీ మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ అశుతోష్ గుప్తా స్పందించారు. ప్రాథమికంగా ఇది వైరల్ ఇన్ఫెక్షన్ అని భావిస్తున్నామని, మరిన్ని పరీక్షల తర్వాత దీనిపై ఓ నిర్ధారణకు వస్తామని వెల్లడించారు. అటు, ఈ వ్యాధి ఏమిటన్నది తెలుసుకునేందుకు పుణేలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, పీజీఐ (చండీగఢ్), నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఎయిమ్స్ వంటి ప్రఖ్యాత సంస్థల నుంచి నిపుణులు బధాల్ గ్రామానికి తరలివెళ్లారు.

మరిన్ని వార్తలకోసం :

రష్యా సైన్యంలో పని చేస్తున్న భారతీయుడు మృతి.. అసలు కథ ఇది!

కుంభమేళాలో సాధువుకు ఆగ్రహం తెప్పించిన యూట్యూబర్..సీన్ కట్ చేస్తే..

సంక్రాంతి పండుగ చేసుకోని ఏకైక గ్రామం.. ఆరోజు స్నానం కూడా చేయరట!

Published on: Jan 18, 2025 07:42 PM