Smriti Irani: ప్రపంచ ఆర్థిక సదస్సుకు స్మృతి ఇరానీ.. అలయన్స్ ఫర్ గ్లోబల్ గుడ్ చైర్‌పర్సన్‌గా..
ప్రపంచ ఆర్థిక సదస్సును ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వర్చువల్‌గా ప్రసంగించనున్నారు. ఈసారి ప్రత్యేకత ఏమిటంటే, బిజెపి నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ ప్రభుత్వ ప్రతినిధిగా కాకుండా CII ఫోరమ్ ప్రతినిధిగా, అలయన్స్ ఫర్ గ్లోబల్ గుడ్ చైర్‌పర్సన్‌గా ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరుకానున్నారు. మొత్తం మూడు సెషన్లలో స్మృతి ఇరానీ ప్రసంగించనున్నారు.

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సు (WEF)కి ఇవాళ ప్రారంభం కానుంది.. ప్రపంచ ఆర్థిక సదస్సు సోమవారం (జనవరి 20 – 24 ) శుక్రవారం వరకు ఐదు రోజులపాటు జరుగుతుంది. ఈ World Economic Forum సదస్సులో ప్రపంచంలోని వ్యాపార, రాజకీయ దిగ్గజాలు, పారిశ్రామిక వేత్తలు, ప్రజాప్రతినిధులు, పలు దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారు. అయితే.. ఈ ప్రపంచ సదస్సులో పెట్టుబడులు పెట్టేందుకు తాము ఎలాంటి అవకాశాలు కల్పిస్తున్నాం.. పెట్టుబడులు పెట్టడానికి సౌకర్యాలు, తదితర అంశాలను ప్రతినిధులు.. వివరించనున్నారు.. మొత్తంగా ప్రపంచంలోని 70 ముఖ్యమైన, శక్తివంతమైన దేశాలకు చెందిన రాజకీయ నాయకులు, ఆర్థికవేత్తలు ఈ సమావేశంలో పాల్గొంటారు.
ఈ ప్రపంచ ఆర్థిక సదస్సును ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వర్చువల్‌గా ప్రసంగించనున్నారు. ఈసారి ప్రత్యేకత ఏమిటంటే, బిజెపి నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ ప్రభుత్వ ప్రతినిధిగా కాకుండా CII ఫోరమ్ ప్రతినిధిగా, అలయన్స్ ఫర్ గ్లోబల్ గుడ్ చైర్‌పర్సన్‌గా ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరుకానున్నారు. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో CII సెంటర్ ఫర్ ఉమెన్ లీడర్‌షిప్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.. అయితే.. అలయన్స్ ఫర్ గ్లోబల్ గుడ్ చైర్‌పర్సన్‌గా స్మృతి ఇరానీ ప్రపంచ వేదికపై తన అభిప్రాయాలను పంచుకోనున్నారు.
5 రోజుల పాటు జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక చర్చలో మూడు సెషన్లలో స్మృతి ఇరానీ వక్తగా ప్రసంగించనున్నారు. జనవరి 22న 2 సెషన్లలో, జనవరి 23న 1 సెషన్‌లో స్మృతి ఇరానీ ఈ ప్రపంచ వేదికపై భారత్ లో అవకాశాలు, మహిళల పాత్ర గురించి తన అభిప్రాయాలను పంచుకుంటారు.
జనవరి 22న, ఆమె ప్రపంచ ఆర్థిక వేదికలో ఒక సెషన్‌ను మోడరేట్ చేస్తారు. తన మొదటి సెషన్‌లో, స్మృతి ఇరానీ విద్యా సంస్కరణలు, లింగ సమానత్వం, స్కేలబుల్ ఆర్థిక విధానాలకు మద్దతు ఇవ్వడం వంటి అంశాలపై మాట్లాడుతారు.
ప్రపంచ ఆర్థిక వేదిక రెండవ సెషన్‌లో వ్యవస్థాగత సంస్కరణలపై స్మృతి ఇరానీ.. శక్తి – లింగ సమానత్వం అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తంచేస్తారు.
వీడియో చూడండి..
జనవరి 23న, స్మృతి ఇరానీ తన మూడవ ప్రసంగంలో మహిళా – శిశు అభివృద్ధి మంత్రిగా పోషకాహారంలో మార్పు తీసుకురావడానికి నాయకత్వం వహించిన తీరు, అనుభవాలను పంచుకుంటారు.
భారత ప్రతినిధి బృందంలో ఐదుగురు కేంద్ర మంత్రులు, ముగ్గురు ముఖ్యమంత్రులు, అనేక రాష్ట్రాల మంత్రులు, అలాగే దాదాపు 100 మంది ముఖ్య కార్యనిర్వాహక అధికారులు (CEOలు), ప్రభుత్వ, పౌర సమాజం, కళలు, సంస్కృతి రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు ఉన్నారు.
కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అశ్విని వైష్ణవ్ భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. ఈ సమావేశానికి మరో నలుగురు కేంద్ర మంత్రులు సిఆర్ పాటిల్, చిరాగ్ పాశ్వాన్, జయంత్ చౌదరి, కె రామ్ మోహన్ నాయుడు కూడా హాజరుకానున్నారు.
వీరితో పాటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు.
కేంద్ర మంత్రిగా స్మృతి ఇరానీ గత ప్రపంచ ఆర్థిక వేదికలో భారత ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించిన బృందంలో ప్రముఖ పాత్ర పోషించడం గమనార్హం..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
