AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajya Sabha: కేకే రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ సీటు ఎవరికిస్తారు..?

కే.కేశవరావుకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరి ఆయన రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ సీటును ఎవరికిస్తారు..? తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకిస్తారా...? లేదంటే సీనియర్లకు కేటాయిస్తారా..?

Rajya Sabha: కేకే రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ సీటు ఎవరికిస్తారు..?
K Kesava Rao Abhishek Manu Singhvi
Balaraju Goud
|

Updated on: Jul 06, 2024 | 9:43 PM

Share

కే.కేశవరావుకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరి ఆయన రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ సీటును ఎవరికిస్తారు..? తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకిస్తారా…? లేదంటే సీనియర్లకు కేటాయిస్తారా..? అసలు హైకమాండ్‌ ఆలోచనేంటి..? అన్నదీ ఆసక్తికరంగా మారింది.

కే. కేశ‌వ‌రావుకు రాష్ట్ర ప్రభుత్వం కీల‌క ప‌ద‌వి కట్టబెట్టింది. ఇటీవల బీఆర్ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఆయనను ప్రభుత్వ సలహాదారుడిగా నియమిస్తూ… ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ప‌బ్లిక్ అఫైర్స్ స‌ల‌హాదారుగానూ ఆయ‌న కొన‌సాగ‌నున్నారు. అలాగే కేకేకు కేబినెట్ హోదా కూడా క‌ల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

బీఆర్ఎస్ నుంచి రాజ్యసభ ఎంపీగా నామినేట్‌ అయిన కేకే… ఇటీవలె కాంగ్రెస్‌లో చేరారు. ఒకపార్టీ నుంచి పదవి పొంది మరో పార్టీలో చేరినప్పుడు రాజీనామా చేయడం నైతిక బాధ్యతగా భావిస్తూ… ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన ఒక్కరోజులోనే అమోదం లభించింది. దీంతో ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ కేకేకి కీలక పదవి కట్టబెట్టింది కాంగ్రెస్‌ ప్రభుత్వం.

ఇక రాజ్యసభ సభ్యత్వానికి కే కే రాజీనామా చేయడంతో ఆ సీటు ఎవరికి ఇస్తారన్నది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. తెలంగాణకు చెందిన వ్యక్తి కావడంతో ఇక్కడ వాళ్లకే సీటు ఇస్తారన్న వాదనలు వినిపించాయి. కానీ ఆ సీటును పార్టీలోని కీలక నేతకు ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన చేస్తుందనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఏఐసీసీ అధికార ప్రతినిధి, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అభిషేక్‌ మను సింఘ్వీకి ఆ సీటు ఇవ్వడం ఖాయమంటూ తెగ ప్రచారం జరుగుతోంది. పార్టీ హైకమాండ్ ఆయనకు దాదాపుగా గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చినట్టు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ఇటీవల హిమాచల్‌ప్రదేశ్‌లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి జరిగిన ఎన్నికలో అభిషేక్ సింఘ్వీ అనుకోకుండా ఓటమి పాలయ్యారు. దీంతో ఆయనను మరో చోట నుంచి పెద్దల సభకు పంపాలని కాంగ్రెస్‌ హైకమాండ్‌ భావిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Follow Us
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
అరుదైన గ్రహల కలయిక.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
అరుదైన గ్రహల కలయిక.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
మహిళా సంఘాలకు సూపర్ న్యూస్.. ఆడబిడ్డల దశ మార్చే నిర్ణయం..
మహిళా సంఘాలకు సూపర్ న్యూస్.. ఆడబిడ్డల దశ మార్చే నిర్ణయం..
రేషన్ కార్డు ఉన్నవారికి పండుగలాంటి వార్త.. ప్రతీఒక్కరికీ డబ్బులు
రేషన్ కార్డు ఉన్నవారికి పండుగలాంటి వార్త.. ప్రతీఒక్కరికీ డబ్బులు
రెడ్ vs గ్రీన్ క్యాప్సికమ్: ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది
రెడ్ vs గ్రీన్ క్యాప్సికమ్: ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది
పచ్చి కూరగాయల స్వీట్ హల్వా .. ఒక్కసారి తింటే మర్చిపోలేని రుచి
పచ్చి కూరగాయల స్వీట్ హల్వా .. ఒక్కసారి తింటే మర్చిపోలేని రుచి
రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం నుంచి సూపర్ న్యూస్
రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం నుంచి సూపర్ న్యూస్