Telangana: రాజకీయాల్లో తండ్రి కలను నెరవేర్చిన తనయుడు.. అసెంబ్లీ మెట్లెక్కనున్న నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే
రాజకీయాలు అంతే ఎవరికి అంతుచిక్కవు. తండ్రి ఐదుసార్లు పోటిచేసినా గెలవని స్థానంలో తొలిసారి పోటి చేసి కుమారుడు గెలిచాడు. వినడానికి నమ్మశక్యంగా లేకున్నా నాగర్ కర్నూల్ నియోజకవర్గ ఎన్నికల బరిలో చోటుచేసుకున్న ఓ రాజకీయ పరిణామం ఇది. కూచుకుళ్ల దామోదర్ రెడ్డి నాలుగు దశాబ్ధాలుగా నాగర్ కర్నూల్ రాజకీయాల్లో క్రీయాశీలకంగా ఉన్న నేత.

రాజకీయాలు అంతే ఎవరికి అంతుచిక్కవు. తండ్రి ఐదుసార్లు పోటిచేసినా గెలవని స్థానంలో తొలిసారి పోటి చేసి కుమారుడు గెలిచాడు. వినడానికి నమ్మశక్యంగా లేకున్నా నాగర్ కర్నూల్ నియోజకవర్గ ఎన్నికల బరిలో చోటుచేసుకున్న ఓ రాజకీయ పరిణామం ఇది. కూచుకుళ్ల దామోదర్ రెడ్డి నాలుగు దశాబ్ధాలుగా నాగర్ కర్నూల్ రాజకీయాల్లో క్రీయాశీలకంగా ఉన్న నేత. 1981లో తూడుకుర్తి సర్పంచ్ గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి అంచెలంచలుగా ఎదిగారు. జడ్పీచైర్ పర్సన్ గా.. రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా పనిచేశారు.
ఇక శాసనసభలో అడుగుపెట్టాలన్న కాంక్షతో ఐదు పర్యాయాలు ఎన్నికల బరిలో నిలిచారు. 1999, 2004, 2009, 2012, 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటి చేసి ఓటమి పాలయ్యారు. వయసు మీద పడుతుండడంతో ఆశలు చాలించుకున్న కూచుకుళ్ల దామోదర్ రెడ్డి.. తన కుమారుడిని రాజకీయాల్లోకి రంగప్రవేశం చేయించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన కుమారుడు రాజేశ్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నాలు జరిపారు. కానీ టికెట్ దక్కే అవకాశాలు కనిపించకపోవడంతో తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతూనే కుమారుడుని కాంగ్రెస్ లో చేర్పించారు.
తన పలుకుబడితో కాంగ్రెస్ లో కుమారుడికి టికెట్ ఇప్పించి.. ఎన్నికల ముందు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. కుమారుడి విజయం కోసం అహర్నిశలు కృషి చేశారు. అభ్యర్థి కుమారుడే అయినప్పటికి తెర వెనుక ప్రచారం, గెలుపు ప్రణాళికలను పక్కాగా అమలు చేశారు దామోదర్ రెడ్డి. ఇక నువ్వా నేనా అన్నట్లు సాగిన ఎన్నికల్లో కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి బలమైన బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్థన్ రెడ్డిపై 5,224 ఓట్ల మెజారిటీతో విజయబావుట ఎగరేసారు. అయితే నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో దాదాపు 30 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందడం విశేషం. ఈ చారిత్రాత్మక ఘట్టం కూడా కూచుకుళ్ల కుటుంబంతోనే సాధ్యమైంది. పోటి చేసిన తొలిసారే విజయం సాధించిన ఈ డాక్టర్ బాబు రాజేశ్ రెడ్డి అసెంబ్లీ మెట్లేక్కెందుకు సిద్ధమయ్యారు. తండ్రి చిరకాల వాంఛను నెరవేర్చి ఎమ్మెల్యేగా గెలవడంతో అటూ కుటుంబ సభ్యులు సైతం ఆనందంలో మునిగిపోయారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








