AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోడ్డు ప్రమాదంపై హత్యాయత్నం కేసు.. పోలీసుల అత్యుత్సాహం ఒక యువకుడి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎలా బలితీసుకుంది?

ఒక చిన్న ప్రమాదం, దానికి తోడైన పోలీసుల నిర్లక్ష్యం లేదా అత్యుత్సాహం ఒక పేద యువకుడి జీవితాన్ని, అతని కన్నవారి కలలను ఎలా దెబ్బతీస్తాయో నిరూపించే ఉదంతం వికారాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదాన్ని హత్యాయత్నంగా చిత్రీకరించి, ఒక యువకుడిని జైలుకు పంపడం ద్వారా అతను కష్టపడి సాధించుకున్న ప్రభుత్వ ఉద్యోగ అవకాశం చేజారిపోయింది. అసలేం జరిగింది పూర్తి వివరాల్లోకి వెళితే..

రోడ్డు ప్రమాదంపై హత్యాయత్నం కేసు.. పోలీసుల అత్యుత్సాహం ఒక యువకుడి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎలా బలితీసుకుంది?
Attempt To Murder Case
Sravan Kumar B
| Edited By: |

Updated on: Jun 14, 2026 | 9:31 PM

Share

వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామంలో జరిగిన ఒక సాధారణ రోడ్డు ప్రమాదం, ఒక యువకుడి భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చింది. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామానికి చెందిన మర్పల్లి శ్రీనివాస్ కుమారుడు అనిర్వేష్ (20) ఈ నెల 2వ తేదీన గ్రామంలో తన స్కూటీపై వెళ్తున్నాడు. అదే సమయంలో వెనుక నుండి వచ్చిన ఒక బుల్లెట్ మోటార్ సైకిల్ అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ కిందపడగా, బుల్లెట్ నడుపుతున్న జాఫర్ అనే వ్యక్తి చేతికి స్వల్ప గాయమైంది. ఇది సాధారణంగా రోడ్లపై జరిగే ప్రమాదమే.

ఈ ఘటనపై జాఫర్ సోదరుడు మోహిజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, పెద్దేముల్ పోలీసులు కనీస విచారణ జరపకుండా, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి అనిర్వేష్‌పై ఏకంగా హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అంతటితో ఆగకుండా ఈ నెల 8న అతడిని రిమాండ్‌కు తరలించారు. పోలీసుల ఈ తొందరపాటు చర్య అనిర్వేష్ జీవితాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. అతను కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పోస్టల్ శాఖ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఈ నెల 9న దానికి సంబంధించిన కీలకమైన ఇంటర్వ్యూ/డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరగాల్సి ఉంది. కానీ, అంతకుముందు రోజే (8వ తేదీన) పోలీసులు అతడిని రిమాండ్‌కు పంపడంతో, అతను ఇంటర్వ్యూకు హాజరు కాలేకపోయాడు. ఫలితంగా చేతికి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగం చేజారిపోయింది. ఒక వైపు కుమారుడు జైలు పాలు కావడం, మరోవైపు జీవితాన్ని మార్చే ఉద్యోగం పోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఈ కేసులో అత్యంత విచిత్రమైన విషయం ఏమిటంటే, గాయపడిన జాఫర్ గానీ, అతని కుటుంబ సభ్యులు గానీ ఇది కేవలం ప్రమాదవశాత్తు జరిగిందేనని, అనిర్వేష్‌కు తమను చంపే ఉద్దేశం లేదని స్పష్టం చేస్తున్నారు. అయినా సరే పోలీసులు కేసును పునఃసమీక్షించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఇవి కూడా చదవండి

తమ కుమారుడి భవిష్యత్తును నాశనం చేసిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని, కేసును నిష్పక్షపాతంగా విచారించాలని కోరుతూ అనిర్వేష్ కుటుంబ సభ్యులు జిల్లా ఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. ఉన్నతాధికారులు స్పందించి ఆ యువకుడికి న్యాయం చేస్తారో లేదో చూడాలి.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us