Telangana: ఆమె భర్త విమెనైజర్‌.. ఫోన్లో ఆ వీడియోలు.. పక్కా ఆధారాలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్తే…

తన భర్త బాగోతాన్ని చూసి షాకయిన భార్య... పోలీసులను ఆశ్రయించింది. సుబేధారిలోని మహిళా పొలీస్ స్టేషన్లో పిర్యాదు చేసింది. కానీ అక్కడ సీన్ రివర్సయ్యింది.

Telangana: ఆమె భర్త విమెనైజర్‌.. ఫోన్లో ఆ వీడియోలు.. పక్కా ఆధారాలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్తే...
Suspended CI Satish
Follow us

|

Updated on: Sep 25, 2022 | 3:31 PM

Crime News: పరాయి మహిళల్ని వల్లో వేసుకునే ఓ కామాంధుడు.. అతడి బారిన పడ్డ భార్య, న్యాయం కోసమొస్తే లంచమడిగిన పోలీస్… ఇదొక ట్రయాంగిల్‌ క్రైమ్ స్టోరీ. భార్యాభర్తల మధ్య వివాదాన్ని పరిష్కరించి న్యాయం చేయాల్సింది పోయి లంచగొండిగా మారిన ఆ పోలీసాఫీసర్ ఇప్పుడు సస్పెండై ఇంట్లో కూర్చున్నాడు. సదరు విమెనైజర్‌ అరెస్టయి జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. ఈ ఇంట్రస్టింగ్ స్టోరీ లోతుల్లోకెళితే… హనుమకొండ(Hanamkonda)లోని స్నేహనగర్ కాలనీకి చెందిన శ్రీకాంత్… ఒక విమెనైజర్‌. పరాయి మహిళలతో రొమాన్స్ చేస్తూ రహస్యంగా వీడియోలు, ఫోటోలు తీయడం అతడికో హాబీ. వన్ ఫైన్ మార్నింగ్ అతగాడి ఫోను భార్య చేతికి చిక్కి… సదరు అశ్లీల దృశ్యాలన్నీ బైటపడ్డాయి. తన భర్త బాగోతాన్ని చూసి షాకయిన భార్య… పోలీసులను ఆశ్రయించింది. సుబేధారి(Subedari)లోని మహిళా పొలీస్ స్టేషన్లో పిర్యాదు చేసింది. ఆ కామాంధుడి వీడియోలు – ఫోటోలు పరిశీలించిన సీ.ఐ. సతీష్… యాక్షన్ తీసుకుంటానని చెప్పి… లక్ష రూపాయలివ్వాలని బేరం పెట్టాడు. బతిమిలాడితే 50 వేల రూపాయలకు ఒప్పుకున్నాడు. ఆ యాభై వేలు కూడా ఓపెన్‌గానే ఫోన్‌పే ద్వారా తన అకౌంట్‌కు ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు. అక్కడితోనే ఆగలేదు. కేసులో అటువైపున్న విమెనైజర్‌ శ్రీకాంత్ దగ్గర కూడా డబ్బు తీసుకుని కేసు నమోదు చేయకుండా టైమ్‌పాస్ చేశాడు. మనస్తాపం చెందిన బాధిత మహిళ వరంగల్(Warangal) పోలీస్ కమిషనర్‌ను ఆశ్రయించింది.

వెంటనే రియాక్ట్ అయిన సీపీ… శ్రీకాంత్‌ను అరెస్ట్ చేశారు. అతగాడి రాసలీలలకు సంబంధించి ఆధారాలు దొరకడంతో దర్యాప్తు మొదలైంది. ఇటు… లంచాలకు మరిగి కేసులో జాప్యం చేసిన సీఐ సతీశ్‌పై విచారణ చేపట్టారు. లంచం తీసుకున్నట్లు నిర్దారణ కావడంతో అతడిని సస్పెండ్ చేశారు. సస్పెండైన సీ.ఐ. పై అనేక అవినీతి ఆరోపణలున్నాయి.. ఆ ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీ ఈ విధంగా క్లయిమాక్స్‌కి వచ్చింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..