Hyderabad: హలో హైదరాబాద్ అంటూ వీడియో షేర్ చేసిన BCCI.. మీరూ ఓ లుక్కేయండి

ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్‌లో డూ ఆర్ డై మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. దాదాపు 3 సంవత్సరాల తర్వాత ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం అందుకు వేదిక కానుంది.

Hyderabad: హలో హైదరాబాద్ అంటూ వీడియో షేర్ చేసిన BCCI.. మీరూ ఓ లుక్కేయండి
Bcci Says Hello Hyderabad
Follow us

|

Updated on: Sep 25, 2022 | 3:47 PM

India vs Australia 2022: టీమిండియా, ఆసీస్‌ మధ్య ఉప్పల్‌ వేదికగా జరగనున్న చివరి టీ20 కోసం.. అభిమాన లోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌ వాసులు లైవ్‌లో.. మ్యాచ్‌ను వీక్షించేందుకు ఆత్రుతగా ఉన్నారు. ఇప్పటికే ఉప్పల్ స్టేడియం(Uppal stadium)లో అభిమానుల కోలాహలం మొదలైపోయింది. ఇక, హైదరాబాద్‌ మ్యాచ్‌కు సంబంధించి.. బీసీసీఐ(BCCI) విడుదల చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. హెలో హైదరాబాద్‌ అంటూ… బీసీసీఐ ట్విట్టర్‌లో పోస్టు చేసిన ఆ వీడియోల అభిమానులు ఆకట్టుకుంటోంది.

మరి కొన్ని గంటల్లో మ్యాచ్‌. స్టేడియానికి ప్లేయర్స్‌ వచ్చేశారు. దీంతో ఉప్పల్‌ స్టేడియం పరిసరాలు సందడిగా మారాయి. మ్యాచ్‌ సమయం దగ్గర పడుతుండడంతో అభిమానులు స్టేడియం దగ్గరకు చేరుకుంటున్నారు. పోలీసులు అలర్ట్‌‌గా ఉన్నారు.  మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఆటగాళ్లు నెట్‌ ప్రాక్టిస్‌ చేయనున్నారు. టీ20 మ్యాచ్‌.. టికెట్ల వివాదం. తొక్కిసలాట. బ్లాక్‌ టికెట్లతో ఆటకుముందే ఉప్పల్ మ్యాచ్‌ వేడెక్కింది. సాయంత్రం ఏడు గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కాబోతోంది. టికెట్ల అమ్మకాల్లో ప్లానింగ్‌ లేకపోవడం, నిర్వాహణ వైఫల్యంతో అభిమానులు ఇబ్బందిపడ్డారు. ఇప్పుడు ఏర్పాట్లు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. దాదాపు మూడేళ్ల తర్వాత మన వద్ద మ్యాచ్‌ జరుగుతోంది.  కరోనాతో మూడేళ్లు స్టేడియం పట్టించుకోలేదు. కనీసం ఇప్పుడు మ్యాచ్‌ జరుగుతున్న టైమ్‌లో కూడా ఏర్పాట్లు సరిగా చేయలేదని విమర్శలు విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ నిర్వాహణ ఎలా ఉండబోతోంది? తేలబోతోంది. ఉప్పల్‌ స్టేడియంలో జరిగే మ్యాచ్‌ కోసం 2500 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. 300 సీసీ కెమెరాల ద్వారా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఎప్పటికప్పుడు పరిస్థితులు పర్యవేక్షిస్తున్నారు. ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ట్రాపిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..