Hyderabad: టికెట్ల తొక్కిసలాటలో గాయపడ్డవారందరికీ స్పెషల్ చాన్స్… మంత్రితో కలిసి మ్యాచ్ వీక్షించే అవకాశం
ఆసియా కప్‌లో దుమ్ములేపిన విరాట్ కోహ్లీ.. ఆసీస్‌తో టీ20 సిరీస్‌లో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. రెండు మ్యాచుల్లో వరుసగా 2, 11 రన్స్ మాత్రమే చేశాడు.
India vs Australia 2022: టికెట్ల అమ్మకాలపై రభస.. బ్లాక్ దందాపై ఆగ్రహావేశాలు.. స్టేడియంలో అరకోర ఏర్పాట్లు.. వీటన్నింటి మధ్య టీ 20 ఫైనల్ ఫైట్‌కి రెడీ అయ్యాయి భారత్-ఆస్ట్రేలియా. చెరో విజయంతో ఇరు జట్లు సమంగా ఉన్నాయి. మరి ఆఖరి ఆటలో అసలైన పంచ్ ఎవరిది? సిరీస్ చేజిక్కించుకునేదెవరు? ఫ్యాన్స్ హంగామాతో ఇప్పటికే ఉప్పల్ స్టేడియం కిక్కిరిసిపోయింది. అభిమాన ఆటగాళ్ల నినాదాలతో హోరెత్తిపోతుంది. ఫస్ట్ మ్యాచ్‌లో 209 రన్స్ భారీ టార్గెట్ కాపాడుకోవడంలో విఫలమైన ఇండియా పరాజయం చవిచూసింది. ఇక ఎనిమిది ఓవర్ల ఆట జరిగిన సెకండ్ టీ20లో 91 రన్స్ ఛేజ్ చేసి మరీ సిరీస్ రేసులో నిలబడింది. ఉప్పల్ వేదికగా జరిగే మూడవ మ్యాచ్‌లో భారత టీం బ్యాటింగ్, బౌలింగ్ సహా ఫీల్డింగ్‌లోనూ ఎలాంటి తప్పులూ చేయకూడదు. ఏ విభాగం విఫలమైనా సరే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.
గాయపడ్డవారితో కలిసి మ్యాచ్ వీక్షించనున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్…
టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో చాలామంది గాయపడిన విషయం తెలిసిందే. వారందరూ ఇప్పుడు కోలుకున్నారు. కాగా, ఉప్పల్ స్టేడియంలో లైవ్‌గా మ్యాచ్ చూడాలన్న వాళ్ల ఆశ కూడా నెరవేరుతోంది. అవును.. మొన్నటి తొక్కిసలాటలో గాయపడ్డ ఫ్యాన్స్… లైవ్‌లో మ్యాచ్ చూడబోతున్నారు. వారిని స్వయంగా క్రీడా మంత్రి శ్రీనివాస్‌గౌడ్… వెంటేసుకుని ఉప్పల్ స్టేడియమ్‌కు వస్తుండటం విశేషం. వాళ్లందరినీ ప్రత్యేకంగా పోలీస్ వ్యాన్‌లో ఎక్కించి.. మ్యాచ్‌కు పంపించారు శ్రీనివాస్‌గౌడ్. వాళ్లతో కలిసి మ్యాచ్ వీక్షించనున్నారు మంత్రి. అంతకుముందు వాళ్లతో కలిసి మాట్లాడిన శ్రీనివాస్‌గౌడ్… మొన్న జరిగిన తొక్కిసలాటపై ఆరా తీశారు. వారి గాయాలను పరిశీలించి..తన సానుభూతి తెలియజేశారు. వాళ్లతో కలిసి టిఫిన్ చేసిన తర్వాత అందర్నీ తోడ్కొని.. స్టేడియమ్‌కు బయల్దేరారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..