AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs Australia 3rd T20I: ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం.. టీ20 సిరీస్ కైవసం..

India vs Australia 3rd T20I Live Score in Telugu: మూడో టీ20 కోసం భారత్‌-ఆస్ట్రేలియా జట్లు సమరం మొదలైంది. మూడు టీ20ల మ్యాచ్​లో ఇప్పటికే చెరొకటి గెలిచి సమంగా ఉన్న ఇరుజట్లు.. చివరిమ్యాచ్‌ గెలిచి సిరీస్‌ కైవసం చేసుకునేందుకు..

India vs Australia 3rd T20I: ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం.. టీ20 సిరీస్ కైవసం..
India vs Australia 2022 T20I Match
Sanjay Kasula
| Edited By: |

Updated on: Sep 26, 2022 | 10:43 AM

Share

India vs Australia 3rd T20I Highlights: హైదరాబాద్ వేదికగా ఉత్కంఠగా జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్‌ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ వీరవిహారం, సూర్య కుమార్‌ సిక్సులతో విజయం సునాయసమైంది. దీంతో భారత్ 2-1 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది. కీలకమైన మూడో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌కు దింపింది. భారత్‌కు ఆస్ట్రేలియా 187 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. బూమ్రా వేసిన చివరి ఓవర్‌ టీమిండియాకు భారీ టార్గెట్‌ను ఇచ్చింది. అయినప్పటికీ.. భారత్‌ బ్యాటర్లు నాలుగు వికెట్ల నష్టానికి ఒక బంతి మిగిలి ఉండగానే ( 19.5 ఓవర్లలో)  187 పరుగులు సాధించారు. సూర్యకుమార్ 69 పరుగులు సాధించగా.. విరాట్ కోహ్లీ 63, పాండ్యా 25 (నాటౌట్) పరుగులు సాధించారు. చివరి ఓవర్‌లో 11 పరుగులు కావాల్సిన తరుణంలో మొదటి బంతికి విరాట్ సిక్స్‌ కొట్టగా.. హార్దిక్‌ పాండ్య ఐదో బంతికి ఫోర్‌ కొట్టి భారత్‌కు విజయంతోపాటు సిరీస్‌ను అందించాడు.

టీ20 సిరీస్‌లో నిర్ణయాత్మక మూడో మ్యాచ్ ఈరోజు హైదరాబాద్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. రెండో టీ20 ఆతిథ్య టీమిండియా విజయం సాధించింది. అలాంటి పరిస్థితుల్లో 9 ఏళ్ల తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకునే అవకాశం భారత్‌కు దక్కనుంది. అయితే గత రికార్డులను పరిశీలస్తే.. 2013లో సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టీ20 సిరీస్‌ను  టీమిండియా గెలుచుకుంది. ఇవాళ రోహిత్ బ్రిగేడ్ కంగారూలను ఓడిస్తే.. 9 ఏళ్ల తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంటే చరిత్ర సృష్టించనట్లవుతుంది.

2017-18లో భారత్-ఆస్ట్రేలియా మధ్య సిరీస్ 1-1తో సమం కాగా, 2018-19లో ఆస్ట్రేలియా 2-0తో విజయం సాధించింది. అయితే ఆస్ట్రేలియా కూడా చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. ఈరోజు ఆస్ట్రేలియా జట్టు టీమిండియాను ఓడిస్తే.. స్వదేశంలో భారత్‌ నుంచి వరుసగా రెండు టీ20 సిరీస్‌లను గెలుచుకున్న ప్రపంచంలోనే తొలి జట్టుగా రికార్డులకెక్కుతుంది.

టీ20 సిరీస్‌లలో భాగంగా తొలిమ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైన టీమ్​ఇండియా.. తర్వాత జరిగిన పోరులో ప్రతీకారం తీర్చుకుంది. ఇక చివరి మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను ముద్దాడాలని పట్టుదలతో ఉంది టీమిండియా జట్టు.  ఈ సిరీస్‌లో 6 ఓవర్లకు 81 పరుగులిచ్చి అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా హర్షల్‌ పటేల్‌ నిలిచాడు.

బుమ్రా అందుబాటులోకి రావడం భారత్‌కు కొంతకలిసొచ్చే అంశంగా మారింది. బ్యాటింగ్‌లో రోహిత్‌, రాహుల్, కోహ్లీ రాణించాలని, చివరిమ్యాచ్‌లోనూ సూర్యకుమార్, హార్దిక్‌, దినేశ్‌ కార్తిక్‌ మెరుపులు మెరిపించాలని యాజమాన్యం భావిస్తోంది.

వర్షం ప్రభావంతో రెండో టీ20లో కెప్టెన్ రోహిత్ శర్మ చివరి క్షణంలో రిషబ్ పంత్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కల్పించాడు. ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ స్థానంలో పంత్ వచ్చాడు. అయితే ఆ మ్యాచ్‌ కేవలం 8-8 ఓవర్లు మాత్రమే కాగా అందులో కేవలం నలుగురు బౌలర్లు మాత్రమే అవసరమయ్యారు. అలాంటి పరిస్థితుల్లో రోహిత్ ఈ మార్పు చేశాడు.

మూడో టీ20లో వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ స్థానంలో భువీ తిరిగి జట్టులోకి రావడం ఖాయమని భావిస్తున్నారు. అదే సమయంలో హర్షల్ పటేల్, దినేష్ కార్తీక్‌లకు కూడా మరోసారి ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం కల్పించవచ్చు.

మూడో టీ20లో టీమిండియా ప్రాబబుల్ ప్లేయింగ్ ఎలెవన్ – రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్.

మూడో T20I కోసం ఆస్ట్రేలియా ప్రాబబుల్ ప్లేయింగ్ XI – ఆరోన్ ఫించ్ (కెప్టెన్), కామెరాన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), జోష్ ఇంగ్లిస్, నాథన్ ఎల్లిస్, పాట్ కమిన్స్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.

Key Events

టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ –

కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్.

ఆస్ట్రేలియా ప్లేయింగ్ XI –

ఆరోన్ ఫించ్(కెప్టెన్), కామెరాన్ గ్రీన్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, టిమ్ డేవిడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), డేనియల్ సామ్స్, పాట్ కమ్మిన్స్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 25 Sep 2022 11:03 PM (IST)

    సిరీస్ కైవసం చేసుకన్న భారత్..

    India vs Australia 3rd T20: హైదరాబాద్ వేదికగా ఉత్కంఠగా జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్‌ ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ వీరవిహారం, సూర్య కుమార్‌ సిక్సులతో విజయం సునాయసమైంది.

  • 25 Sep 2022 10:31 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన భారత్..

    చివరి ఒవర్లో కోహ్లీ (63) ఔటయ్యాడు.  సామ్స్ బౌలింగ్ లో సిక్స్ అనంతరం కోహ్లీ షాక్ కోసం ప్రయత్నించగా.. ఫించ్ క్యాచ్ అందుకున్నాడు.

  • 25 Sep 2022 10:27 PM (IST)

    14 పరుగులు..

    భారత్ విజయం సాధించాలంటే 8 బంతులకు 14 పరుగులు సాధించాల్సి ఉంది.

  • 25 Sep 2022 10:26 PM (IST)

    చివరి రెండు ఓవర్లకు

    చివరి రెండు ఓవర్లకు భారత్ విజయం సాధించాలంటే 21 పరుగులు అవసరం.. కాగా.. పాండ్యా సిక్స్ తో విజృంభించాడు.

  • 25 Sep 2022 10:12 PM (IST)

    16వ ఓవర్లో..

    16వ ఓవర్ నాలుగో బంతికి ఒక్క పరుగు తీసి కోహ్లి అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. 

  • 25 Sep 2022 10:11 PM (IST)

    విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ

    విరాట్ కోహ్లీ 37 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు.

  • 25 Sep 2022 10:05 PM (IST)

    సూర్యకుమార్ యాదవ్ ఔట్..

    సూర్యకుమార్ యాదవ్ 36 బంతుల్లో 69 పరుగులు చేసి అవుటయ్యాడు. 14 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది.

  • 25 Sep 2022 10:01 PM (IST)

    సూర్యకుమార్ యాదవ్ 29 బంతుల్లో అర్ధశతకం..

    సూర్యకుమార్ యాదవ్ 29 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. 13 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ 39, సూర్యకుమార్ యాదవ్ 58 పరుగులతో ఆడుతున్నారు.

  • 25 Sep 2022 10:00 PM (IST)

    2 వికెట్ల నష్టానికి 107 పరుగులు..

    12 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. ఇక్కడ నుంచి జరిగే మ్యాచ్‌లో టీమిండియా గెలవాలంటే 48 బంతుల్లో 80 పరుగులు చేయాలి. 

  • 25 Sep 2022 09:52 PM (IST)

    10 ఓవర్లు ముగిసేసరికి..

    10 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ 35, సూర్యకుమార్ యాదవ్ 31 పరుగులతో ఆడుతున్నారు. గయాతో జరిగే మ్యాచ్‌లో టీమిండియా గెలవాలంటే 60 బంతుల్లో 96 పరుగులు చేయాలి. 

  • 25 Sep 2022 09:11 PM (IST)

    3 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 1 వికెట్ నష్టానికి…

    3 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 1 వికెట్ నష్టానికి 26 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ 13, విరాట్ కోహ్లీ 6 పరుగులతో ఆడుతున్నారు. 

  • 25 Sep 2022 09:02 PM (IST)

    తొలి ఓవర్‌లోనే మొదటి వికెట్‌..

    ఆదిలోనే తడబడుతున్నారు టీమిండియా బ్యాటర్లు. భారత్ తొలి ఓవర్‌లోనే మొదటి వికెట్‌ను కోల్పోయింది. డానియల్ సామ్స్ వేసిన బౌలింగ్‌లో కేఎల్ రాహుల్‌ (1) భారీ షాట్‌కు యత్నించి కీపర్ వేడ్‌ చేతికి క్యాచ్‌ ఇచ్చాడు.

  • 25 Sep 2022 08:59 PM (IST)

    7 వికెట్ల నష్టానికి 186 పరుగులు.. టీమిండియా టార్గెట్ ఇదే..

    నిర్ణీత 20 ఓవర్లలో ఆస్ట్రేలియా జట్టు 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. సిరీస్ గెలవాలంటే టీమిండియా 187 పరుగులు చేయాలి. 20వ ఓవర్‌లో హర్షల్ పటేల్ సిక్స్ సహా ఏడు పరుగులను మాత్రమే ఇచ్చాడు. దీంతో ఆసీస్‌ ఏడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. భారత్‌కు 187 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. ఆసీస్ బ్యాటర్లలో కామెరూన్ గ్రీన్ (52), టిమ్‌ డేవిడ్ (54) అర్ధశతకాలు సాధించారు.

  • 25 Sep 2022 08:57 PM (IST)

    మొదలైన టీమిండియా ఇన్నింగ్స్

    టీమిండియా ఇన్నింగ్స్ మొదలైంది. కెప్టెన్ రోహిత్‌తో కలిసి కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవాలంటే 187 పరుగులు చేయాల్సి ఉంది. 

  • 25 Sep 2022 08:56 PM (IST)

    అక్షర్ పటేల్ సక్సెస్..

    టీమ్ ఇండియాలో అత్యంత విజయవంతమైన బౌలర్ అక్షర్ పటేల్. అక్షర్ పటేల్ 4 ఓవర్లలో 33 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. అదే సమయంలో భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, హర్షల్ పటేల్ 1-1 వికెట్లు తీశారు.

  • 25 Sep 2022 08:42 PM (IST)

    చివరి ఓవర్లలో ఆసీస్‌ ఆటగాళ్లు..

    చివరి ఓవర్లలో ఆసీస్‌ ఆటగాళ్లు విరుచుకుపడ్డారు. 19వ ఓవర్‌ వేసిన బుమ్రా బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు, ఫోర్‌ సహా మొత్తం 18 పరుగులు తీశారు. దీంతో ఆసీస్‌ స్కోరు 179/4కి చేరింది. టిమ్‌ డేవిడ్ 48 పరుగుల వద్ద ఔటయ్యాడు.

  • 25 Sep 2022 08:39 PM (IST)

    భువీ.. మొత్తం 21 పరుగులు

    తొలి మూడు బంతులకు ఐదు పరుగులను మాత్రమే ఇచ్చిన భువీ.. చివరి మూడు బంతుల్లో రెండు సిక్స్‌లు, ఒక ఫోర్‌తో సహా మొత్తం 21 పరుగులను ఇచ్చాడు.

  • 25 Sep 2022 08:35 PM (IST)

    6 వికెట్ల నష్టానికి 161 పరుగులు..

    ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 18 ఓవర్లు పూర్తయింది. ఈ ఓవర్లలో ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. భువనేశ్వర్ కుమార్ 18వ ఓవర్లో 20 పరుగులు చేశాడు. 

  • 25 Sep 2022 08:26 PM (IST)

    6 వికెట్ల నష్టానికి 134 పరుగులు..

    16 ఓవర్లలో ఆస్ట్రేలియా జట్టు 6 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. క్రీజులో డేనియల్ సామ్స్ 12, టిమ్ డేవిడ్ 19 పరుగులతో ఆడుతున్నారు.

  • 25 Sep 2022 08:26 PM (IST)

    అక్షర్ పటేల్ దూకుడు.. మరో కీలక వికెట్‌..

    ఆస్ట్రేలియా మరో కీలక వికెట్‌ను కోల్పోయింది. తొలి రెండు మ్యాచుల్లో భారత బౌలర్లను ఉతికేసిన మ్యాథ్యూ వేడ్.. కేవలం ఒకే ఒక్క పరుగుతో ఇంటి దారి పట్టాడు. 13.5వ ఓవర్‌‌లో అక్షర్‌ పటేల్ వేసిన బంతిని నేరుగా అతడికి కొట్టి క్యాచ్‌ ఇచ్చి వేడ్ పెవిలియన్‌ దారి పట్టాడు. ఈ ఓవర్‌లో రెండు పరుగులే ఇచ్చిన అక్షర్‌ కీలకమైన రెండు వికెట్లను తీయడం విశేషం.

  • 25 Sep 2022 08:22 PM (IST)

    ఐదో వికెట్‌ పోయిందే..

    అక్షర్ పటేల్ రెండో వికెట్ పడింది. దూకుడుగా ఆడుతున్న ఆసీస్‌కు అక్షర్ పటేల్ మళ్లీ కళ్లెం వేశాడు. కీలక సమయంలో జోష్ ఇంగ్లిస్‌ (24) వికెట్‌ను పడగొట్టాడు. అక్షర్‌ వేసిన బంతిని షాట్‌కు ఆడేందుకు యత్నించిన జోష్‌ ఆఫ్‌సైడ్‌లో ఉన్న రోహిత్‌ తేలిగ్గా పట్టేశాడు. దీంతో ఆసీస్‌ 115 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను కోల్పోయింది.

  • 25 Sep 2022 08:07 PM (IST)

    ఆస్ట్రేలియా స్కోరు 100 పరుగులు దాటింది

    12 ఓవర్లలో ఆస్ట్రేలియా జట్టు 4 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. జోష్ ఇంగ్లిస్ 23, టిమ్ డేవిడ్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 25 Sep 2022 08:07 PM (IST)

    10 ఓవర్ల తర్వాత ఆస్ట్రేలియా..

    10 ఓవర్లలో ఆస్ట్రేలియా జట్టు 4 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. జోష్ ఇంగ్లిస్ 10 పరుగులతో, టిమ్ డేవిడ్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.

  • 25 Sep 2022 08:06 PM (IST)

    స్టీవ్ స్మిత్‌ను పెవిలియన్‌కు పంపిన యుజ్వేంద్ర చాహల్

    యుజ్వేంద్ర చాహల్ టీమ్ ఇండియాకు నాలుగో విజయాన్ని అందించాడు. యుజ్వేంద్ర చాహల్ 9 పరుగుల వద్ద స్టీవ్ స్మిత్‌ను పెవిలియన్‌కు పంపాడు.  

  • 25 Sep 2022 07:42 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

    మూడో వికెట్ కూడా కోల్పోియంది ఆస్ట్రేలియా.  7 ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా 2 వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది. క్రీజులో స్టీవ్ స్మిత్ 7, గ్లెన్ మాక్స్ వెల్ 4 పరుగులతో ఆడుతున్నారు.

  • 25 Sep 2022 07:27 PM (IST)

    మరో వికెట్ పోయింది.. కామెరూన్ గ్రీన్‌ ఔట్..

    ఆస్ట్రేలియా ఓపెనర్ కామెరాన్ గ్రీన్ 21 బంతుల్లో 52 పరుగులు చేసి ఔటయ్యాడు. 5 ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా 2 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. కామెరూన్ గ్రీన్‌ని భువనేశ్వర్ కుమార్ ఔట్ చేశాడు.

  • 25 Sep 2022 07:21 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా..

    ఆస్ట్రేలియా జట్టుకు తొలి దెబ్బ పడింది. 7 పరుగుల స్కోరు వద్ద ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ను అక్షర్ పటేల్ పెవిలియన్‌కు పంపాడు. 4 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా 1 వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది.

  • 25 Sep 2022 07:05 PM (IST)

    ఆస్ట్రేలియా బ్యాటింగ్..

    ఆస్ట్రేలియా జట్టు ఇన్నింగ్స్‌ ప్రారంభమైంది. కెప్టెన్ ఫించ్‌తో కలిసి కెమరూన్ గ్రీన్ క్రీజులో ఉన్నాడు. భువనేశ్వర్ కుమార్ తొలి ఓవర్ చేస్తున్నాడు. 

  • 25 Sep 2022 07:00 PM (IST)

    ఆస్ట్రేలియా ప్రాబబుల్ ప్లేయింగ్ XI సభ్యులు వీరే

    ఆరోన్ ఫించ్(కెప్టెన్), కామెరాన్ గ్రీన్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, టిమ్ డేవిడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), డేనియల్ సామ్స్, పాట్ కమ్మిన్స్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్

  • 25 Sep 2022 06:58 PM (IST)

    మూడో టీ20లో టీమిండియా తుది జట్టు సభ్యులు వీరే..

    కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్.

  • 25 Sep 2022 06:55 PM (IST)

    టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న టీమిండియా..

    ఆస్ట్రేలియాతో జరుగుతున్న నిర్ణయాత్మక మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచింది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆస్ట్రేలియా జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది.

  • 25 Sep 2022 06:06 PM (IST)

    అశ్విన్‌‌కు ఛాన్స్.. మరి ఔట్ ఎవరు..?

    ఉప్పల్‌ స్టేడియాంకు భారీగా అభిమానులు చేరుకుంటున్నారు. మ్యాచ్‌ వీక్షించనున్న 35వేల మంది ప్రేక్షకులు. ఇప్పటికే స్టేడియానికి చేరుకున్నారు ఇరుజట్ల సభ్యులు. కాసేపు వామప్‌ తర్వాత టీమ్‌ మీటింగ్ జరగనుంది. టీమ్‌మేట్స్‌కి వ్యూహాలను వివరించనున్న కోచ్‌, కెప్టెన్‌. సరిగ్గా 6.30కి టాస్‌కి వెళ్లనున్నారు ఇరు జట్లు కెప్టెన్లు. రాత్రి 7 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. భారత జట్టులో స్వల్ప మార్పులు జరిగే ఛాన్స్ కనిపిస్తోంది. అశ్విన్‌ను టీమ్‌లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారిదే సిరీస్‌.

  • 25 Sep 2022 05:45 PM (IST)

    2500 మంది పోలీసులు.. 300 సీసీ కెమెరాలు..

    ఉప్పల్‌ స్టేడియంలో జరిగే మ్యాచ్‌ కోసం 2500 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. 300 సీసీ కెమెరాల ద్వారా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఎప్పటికప్పుడు పరిస్థితులు పర్యవేక్షిస్తున్నారు.

  • 25 Sep 2022 05:44 PM (IST)

    మూడేళ్ల తర్వాత జరుగుతున్న మ్యాచ్..

    కరోనాతో మూడేళ్లు స్టేడియం పట్టించుకోలేదు. కనీసం ఇప్పుడు మ్యాచ్‌ జరుగుతున్న టైమ్‌లో కూడా ఏర్పాట్లు సరిగా చేయలేదని విమర్శలు విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ నిర్వాహణ ఎలా ఉండబోతోంది? తేలబోతోంది.

  • 25 Sep 2022 05:43 PM (IST)

    సాయంత్రం మ్యాచ్‌ ఉంటే.. రెండు గంటల ముందు ఏర్పాట్లు

    సాయంత్రం మ్యాచ్‌ ఉంటే..ఇప్పుడు ఏర్పాట్లు చేయడం హెచ్‌సీఏ నిర్లక్ష్యాన్ని బయటపెడుతోంది. టికెట్ల అమ్మకాల్లో ప్లానింగ్‌ లేకపోవడం, నిర్వాహణ వైఫల్యంతో అభిమానులు ఇబ్బందిపడ్డారు. ఇప్పుడు ఏర్పాట్లు చేస్తుండడంతో సాయంత్రం మ్యాచ్‌ ఎలా జరగబోతోంది? అనే టెన్షన్‌ నెలకొంది.

  • 25 Sep 2022 05:43 PM (IST)

    ఉప్పల్ స్టేడియం వద్ద ఆలస్యంగా ఏర్పాట్లు..

    టీ20 మ్యాచ్‌..టికెట్ల వివాదం. తొక్కిసలాట. బ్లాక్‌ టికెట్లతో ఆటకుముందే ఉప్పల్ మ్యాచ్‌ వేడెక్కింది. సాయంత్రం ఏడు గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కాబోతోంది. కానీ ఆలస్యంగా ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 4 గంటల సమయంలో స్టేడియం చుట్టూ చెట్లు తొలగిస్తున్నారు.

  • 25 Sep 2022 05:41 PM (IST)

    గేట్‌ నెంబర్‌ వన్ దగ్గర ప్రత్యేక పోలీసు అశ్వదళం

    కాసేపట్లో స్టేడియానికి ఇరుజట్ల ఆటగాళ్లు స్టేడియానికి రాబోతున్నారు. దీంతో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. ఆటగాళ్లు లోపలికి వెళ్లనున్న గేట్‌ నెంబర్‌ వన్ దగ్గర ప్రత్యేక పోలీసు అశ్వదళం ఏర్పాటు చేశారు. మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఆటగాళ్లు నెట్‌ ప్రాక్టిస్‌ చేయనున్నారు.

  • 25 Sep 2022 05:31 PM (IST)

    సందడిగా ఉప్పల్‌ స్టేడియం పరిసరాలు

    మరి కొన్ని గంటల్లో మ్యాచ్‌. కాసేపట్లో స్టేడియానికి ప్లేయర్స్‌ రాక. దీంతో ఉప్పల్‌ స్టేడియం పరిసరాలు సందడిగా మారాయి. మ్యాచ్‌ సమయం దగ్గర పడుతుండడంతో అభిమానులు స్టేడియం దగ్గరకు చేరుకుంటున్నారు.

Published On - Sep 25,2022 5:30 PM