AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ ఫోన్ అమ్మాలనుకుంటున్నారా.. పోలీసు కేసులు తప్పవు జాగ్రత్త..

పాత మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తూ నేరాలకు పాల్పడుతున్న ముగ్గురుని తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ నేరాల్లో వినియోగించేందుకు పాత మొబైల్ ఫోన్లను అక్రమంగా కొనుగోలు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను సైబర్ సెక్యూరిటీ బ్యూరో రామగుండం పోలీసులుఅరెస్టు చేశారు. సుమారు 4000 మొబైల్ ఫోన్లు, మూడు బైకులను స్వాధీనం చేసుకున్నారు.

మీ ఫోన్ అమ్మాలనుకుంటున్నారా.. పోలీసు కేసులు తప్పవు జాగ్రత్త..
Smart Phones
Vijay Saatha
| Edited By: |

Updated on: Aug 22, 2024 | 12:03 AM

Share

పాత మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తూ నేరాలకు పాల్పడుతున్న ముగ్గురుని తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ నేరాల్లో వినియోగించేందుకు పాత మొబైల్ ఫోన్లను అక్రమంగా కొనుగోలు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను సైబర్ సెక్యూరిటీ బ్యూరో రామగుండం పోలీసులుఅరెస్టు చేశారు. సుమారు 4000 మొబైల్ ఫోన్లు, మూడు బైకులను స్వాధీనం చేసుకున్నారు. గోదావరిఖని మేడిపల్లి NTPC ఏరియాలో బీహార్‎కు చెందిన కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు రామగుండం సీసీపీఎస్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సిబ్బందికి విశ్వసనీయ సమాచారం అందింది. సైబర్ నేరాల కోసం పాత మొబైల్ ఫోన్లను తక్కువ ధరకు ప్రజల నుంచి కొనుగోలు చేసి ప్లాస్టిక్ వస్తువులు లేదా డబ్బును ఇచ్చి కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న సీసీపీఎస్ ఎస్ హెచ్ వో, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. వీరంతా బీహార్‎లోని హతియా దియారా నివాసితులుగా గుర్తించారు. వారి వద్ద నుంచి సుమారు 4 వేల పాత మొబైల్ ఫోన్లు ఉన్న మూడు గోనె సంచులను స్వాధీనం చేసుకున్నారు.

రామగుండం, దాని చుట్టుపక్కల జిల్లాల్లో నెల రోజుల నుంచి బిహార్‎కు తరలించాలనే ఉద్దేశంతో నిందితులు ప్రజల నుంచి తక్కువ ధరకు పాత మొబైల్ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారని విచారణలో వెల్లడైంది. అసోసియేట్ ద్వారా జార్ఖండ్ రాష్ట్రంలోని జమ్తారా, దియోఘర్ తదితర ప్రాంతాలకు చెందిన సైబర్ మోసగాళ్లకు ఈ మొబైల్ ఫోన్లు సరఫరా అవుతాయి. సైబర్ మోసగాళ్లకు విక్రయించే ముందు వారి సహచరుడు అక్తర్ ఆ మొబైల్ ఫోన్ల సాఫ్ట్వేర్, మదర్ బోర్డు, ఇతర భాగాలను రిపేర్ చేసి సైబర్ నేరగాళ్లకు ఇచ్చేవాడు. ఈ సైబర్ మోసగాళ్లు రిపేర్ చేసిన ఫోన్లను ఉపయోగించి సైబర్ మోసాలకు పాల్పడి తద్వారా సంపాదించిన డబ్బును అక్తర్ కు సంబంధించిన ముఠా పంచుకునేవారు. రామగుండం టీజీసీఎస్బీలోని సీసీపీఎస్లో Cr.No.30/2024, Sec. 318(4), 319(2), 61(2) BNS, Sec. 106 BNSS యాక్ట్, Sec. 66 (D) IT act-2008 ల కింద కేసు నమోదు చేశారు.

అందువల్ల ప్రజలు తమ పాత మొబైల్ ఫోన్లను గుర్తుతెలియని వ్యక్తులకు అమ్మవద్దని, ఇవ్వొద్దని సూచించారు. పాత ఫోన్లను గుర్తుతెలియని వ్యక్తులకు విక్రయిస్తే వాటిని సైబర్ మోసాలకు ఉపయోగించే అవకాశం ఉందని తెలిపారు. డివైజ్ ఐడెంటిటీ కారణంగా అమ్మకందారులు కూడా నేరాలకు పాల్పడే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. అందువల్ల ప్రజలు తమ పాత ఫోన్లను విక్రయించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఒకవేళ అమ్మినచో అమ్మకందారులు కూడా నేరస్తులుగా పరిగణించబడతారని హెచ్చరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..