Telangana: మావోల భారీ కుట్ర భగ్నం.. ప్రాణాలపై గిరిజనులు ఆందోళన..
చత్తీస్గడ్ - తెలంగాణ సరిహద్దు ములుగు జిల్లా ఏజెన్సీలో గ్రామాల్లో క్షణక్షణం టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంటుంది. తాజాగా మావోయిస్టుల మరో భారీ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. మావోయిస్టుల మందుపాతరలు అమాయక ప్రజల ప్రాణాలను మింగేస్తుండడంతో ఒకప్పుడు మావోలకు షెల్టర్ ఇచ్చిన గ్రామాల్లోనే ఇప్పుడు ప్రజా ఉద్యమాలు పురుడు పోసుకుంటున్నాయి. మావోలకు వ్యతిరేకంగా ఊళ్లకు ఊళ్లు ఉసిళ్ళ పుట్టలా కదిలి నిరసన గలమెత్తుతున్నారు.

చత్తీస్గడ్ – తెలంగాణ సరిహద్దు ములుగు జిల్లా ఏజెన్సీలో గ్రామాల్లో క్షణక్షణం టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంటుంది. తాజాగా మావోయిస్టుల మరో భారీ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. మావోయిస్టుల మందుపాతరలు అమాయక ప్రజల ప్రాణాలను మింగేస్తుండడంతో ఒకప్పుడు మావోలకు షెల్టర్ ఇచ్చిన గ్రామాల్లోనే ఇప్పుడు ప్రజా ఉద్యమాలు పురుడు పోసుకుంటున్నాయి. మావోలకు వ్యతిరేకంగా ఊళ్లకు ఊళ్లు ఉసిళ్ళ పుట్టలా కదిలి నిరసన గలమెత్తుతున్నారు.
మావోయిస్టులు vs పోలీసుల మధ్య ఆధిపత్యపోరులు అమాయక ప్రజలు బలవుతున్నారు. మావోయిస్టులను మట్టు పెట్టడం కోసం పోలీసులు అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తుంటే.. పోలీసులను బలి తీసుకోవడం కోసం మావోయిస్టులు ల్యాండ్ మైన్స్ అమర్చుతున్నారు. మావోయిస్టులు అమర్చిన మందుపాతరలు అమాయక ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం మావోయిస్టుల మందుపాతర పేలి ఓ గిరిజనుడు బలైపోగా తాజాగా మరో భారీ కుట్రను పోలీసులు చేదించారు. మావోయిస్టులు అమర్చిన మందు పాతరను పోలీసులు నిర్వీర్యం చేసి జనం ఊపిరి పీల్చుకునేలా చేశారు. ఈ నెల 3వ తేదీన ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల గుట్ట పై మందు పాతర పేలింది. కట్టెల కోసం ముగ్గురు వ్యక్తులు అడవికి వెళ్ళగా వారిలో ఏసు అనే గిరిజనుడు మావోయిస్టులు అమర్చిన మందుపాతరకు బలయ్యాడు. మృతుడు జగన్నాథపురం గ్రామానికి చెందిన గిరిజనుడు. ఇతనితో పాటు అడవికి వెళ్ళిన మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
ఈ ఘటన నేపథ్యంలో మావోయిస్టుల పై తిరుగుబాటు మొదలైంది. ఏజెన్సీ గ్రామాల్లో ప్రజలు మావోయిస్టులకు వ్యతిరేకంగా ఊళ్లకు ఊళ్లు నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఒకప్పుడు మావోయిస్టులకు షెల్టర్ జోన్‌గా పేరున్న గ్రామాల్లో ఇప్పుడు మావోయిస్టులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మావోయిస్టులు మా ప్రాణాలు బలి తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. జగన్నాధపురం వై జంక్షన్ నుండి హనుమాన్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మావోయిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజల కోసం పోరాటాలు చేసే మావోయిస్టులు నేడు ప్రజల ప్రాణాలతో బలి తీసుకుంటున్నారని నినాదాలు చేశారు.
ఒకవైపు ప్రజలు నిరసనలు తెలుపుతుంటే మరోవైపు పోలీసులు మావోయిస్టులు అమర్చిన మందుపాతరలు వెలికి తీసే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే భారీ కుట్రను భగ్నం చేశారు. వెంకటాపురం మండలం చలిమల అడవుల్లో మావోయిస్టులు అమర్చిన ల్యాండ్ మైండ్స్‌ని గుర్తించి నిర్వీర్యం చేశారు. ఇదే ప్రాంతంలోని కర్రెగుట్టపై పదుల సంఖ్యలో మావోయిస్టులు మందు పాత్రలు అమర్చారని, అవి ఎప్పుడు ఎవరి ప్రాణాలు బలి తీసుకుంటాయో అర్థం కావడం లేదని స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పోలీసులు అడవులను జల్లెడ పడుతూ మందు పాతరలు నిర్వీర్యం చేస్తున్నారు. మావోయిస్టుల కుట్రలు భగ్నం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ శబరిష్ కూడా ప్రత్యేక బృందాలను రంగంలో దింపి ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి భరోసా కల్పిస్తున్నారు. మావోయిస్టులు బూజుపట్ల సిద్ధాంతాలు వీడి ప్రజల ప్రాణాలను బలి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
