Bhairi Naresh: భైరి నరేష్ అరెస్టు.. వరంగల్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు..
అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న నరేష్‌ను వరంగల్‌లో అదుపులోకి తీసుకున్నారు. అయ్యప్ప స్వామిని ఉద్దేశించి అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్‌ను అరెస్ట్ చేయాలని...

అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న నరేష్‌ను వరంగల్‌లో అదుపులోకి తీసుకున్నారు. అయ్యప్ప స్వామిని ఉద్దేశించి అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్‌ను అరెస్ట్ చేయాలని అయ్యప్ప మాలాధారులు అన్ని జిల్లాల్లో ఆందోళనలు చేస్తున్నారు. పలు పోలీస్ స్టేషన్లలో భైరి నరేష్‌పై సులు నమోదయ్యాయి. హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్‌పై శుక్రవారం కొడంగల్ పోలీసులు నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా.. రెండు రోజుల క్రితం ఓ సభలో హిందూ దేవుళ్లను, అయ్యప్ప స్వామిని ఉద్దేశిస్తూ నరేష్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఇది తీవ్ర దుమారం రేపింది. రాష్ట్ర వ్యాప్తంగా అయ్యప్ప మాలధారులు నిరసనలు, రాస్తారోకో చేపట్టారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న నరేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే.. మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించమని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి స్పష్టం చేశారు.
మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసి, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వికారాబాద్‌లో స్వాములు ప్రదర్శన నిర్వహిస్తున్న సమయంలో భైరి నరేష్ అనుచరుడు ఒకడు వీడియో తీశాడు. నరేష్ వ్యాఖ్యలకు మద్దతుగా స్వాములతో వాదనకు దిగాడు. దీంతో స్వాములకు తీవ్ర కోపం వచ్చింది. అతనిపై మూకుమ్మడి దాడి చేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని అతనిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. భైరి నరేష్ కు చట్ట ప్రకారం శిక్ష పడేటట్లు చూస్తామమని ఎస్పీ ప్రకటించారు. హిందూ దేవి దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్ అనే వ్యక్తిపై పాతబస్తీ చార్మినార్ పోలీస్ స్టేషన్లో బీజేపీ మహిళ నేతల ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటన పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంది. హిందూ దేవుళ్లను కించపరిచిన భైరి నరేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ట్వీట్ చేశారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా నరేశ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. మొత్తానికి బైరి నరేష్ వ్యాఖ్యలు తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..