Hyderabad: ఇంజనీర్ విద్యార్థి నవీన్ హత్యలో యువతి ప్రమేయంపై ఫోకస్.. వాట్సాప్ డేటా రికవరీ చేయనున్న పోలీసులు.
ఇంజనీర్ విద్యార్థి నవీన్ హత్య కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అమ్మాయి విషయంలో తోటి స్నేహితుడినే అత్యంత పాశవికంగా హత్య చేసిన సంఘటన ఉలిక్కిపడేలా చేసింది. ఇదిలా ఉంటే ఈ కేసు విచారణ చేపడుతున్న పోలీసులకు విస్తుపోయే నిజాలు..

ఇంజనీర్ విద్యార్థి నవీన్ హత్య కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అమ్మాయి విషయంలో తోటి స్నేహితుడినే అత్యంత పాశవికంగా హత్య చేసిన సంఘటన ఉలిక్కిపడేలా చేసింది. ఇదిలా ఉంటే ఈ కేసు విచారణ చేపడుతున్న పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలుస్తున్నాయి. బీటెక్ స్టూడెంట్ నవీన్ హత్యకేసులో నిందితుడు హరిహరకృష్ణ నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. హత్య జరిగిన తీరు తెలుసుకొని పోలీసులే షాకయ్యారు. క్రైం వెబ్ సిరీస్‌లు, యూట్యూబ్ చూసి హత్యకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు నవీన్‌ను హత్యకేసులో హరిహరకృష్ణ, యువతి వాట్సాప్ చాట్ వ్యవహారం కొత్తగా వెలుగులోకి వచ్చింది. అయితే వాట్సాప్ చాటింగ్ హరిహరకృష్ణ డిలీట్ చేసినట్లు సమాచారం. దాంతో వాళ్లిద్దరి వాట్సాప్ చాటింగ్ డేటాను రికవరీ చేసే పనిలో పడ్డారు పోలీసులు.
తాను ప్రేమించే యువతితో క్లోజ్‌గా ఉండటం జీర్ణించుకోలేని హరిహరకృష్ణ..నవీన్‌ను దారుణంగా హత్య చేసి గుట్టల్లో పడేశాడు. హత్య సమయంలో చేతికి గ్లౌజులు వేసుకున్న హరిహరకృష్ణ.. మృతదేహాన్ని ఎవరూ గుర్తించకుండా దుస్తులు తొలగించాడు. అతడి గుండెను, వేళ్లను కోసేశాడు. ఆ ఫోటోలు తన ప్రేయసికి వాట్సాప్ లో పంపించగా…సదరు యువతి గుడ్ బాయ్ అంటూ రిప్లై ఇచ్చింది. ఈ విషయాలన్నీ తెలుసుకొని విస్తుపోయిన పోలీసులు…నిందితుడి మానసికస్థితిపై ఆరా తీస్తున్నారు. ఇంత క్రూరంగా చంపడానికి కారణాలను విశ్లేషిస్తున్నారు. గతంలో ఏదైనా నేర చరిత్ర ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్య కేసులో యువతి పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
మరోవైపు నవీన్ మిస్సింగ్ తర్వాత అతని ఫ్రెండ్ మహిపాల్‌కు హరిహరకృష్ణకు ఫోన్ చేశారు. నవీన్ ఎక్కడ వెళ్లాడో తనకు తెలియదని…గంజాయి తాగడానికి వెళ్లాడని , రాత్రి మద్యం సేవించి ఉన్నాడని కేసు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన ఆడియో ప్రస్తుతం వైరలవుతోంది. నవీన్ మంచివాడు కాదు…అమ్మాయి కోసమే వచ్చి ఉంటాడని, మిస్సింగ్ కేసు పెడతామని హరిహరకృష్ణ, మహిపాల్‌కు సలహా ఇచ్చాడు. తాను వరంగల్‌లో ఉన్నానని, మిగతా విషయాలు తర్వాత మాట్లాడతానన్నాడు హరి. క్రైం థ్రిల్లర్‌ను తలపించే నవీన్ మర్డర్ కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. హరిహరకృష్ణను కస్టడీకి తీసుకొని విచారించే అవకాశం ఉంది.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
