PM Modi: తెలంగాణను దోచుకున్నవారిని ఎవరినీ వదలం.. ఇది మోదీ గ్యారంటీ
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాని మోదీ ఇటీవల మల్కాజ్ గిరి లో జరిగిన రోడ్ షో ఎన్నికల శంఖరావం పూరించిన విషయం తెలిసిందే. సౌత్ మిషన్ ఆపరేషన్ లో భాగంగా ఆయన తెలుగు రాష్ట్రాల్లో వరుస పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికే పలు విడుతలుగా తెలంగాణ పర్యటించిన మోదీ తాజాగా నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో భాగమైన జగిత్యాల బహిరంగ సభకు హాజరయ్యారు.
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాని మోదీ ఇటీవల మల్కాజ్ గిరి లో జరిగిన రోడ్ షో ఎన్నికల శంఖరావం పూరించిన విషయం తెలిసిందే. సౌత్ మిషన్ ఆపరేషన్ లో భాగంగా ఆయన తెలుగు రాష్ట్రాల్లో వరుస పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికే పలు విడుతలుగా తెలంగాణ పర్యటించిన మోదీ తాజాగా నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో భాగమైన జగిత్యాల బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్బంగా మోదీ మాట్లాడుతూ అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. తెలంగాణలోని కాళేశ్వర ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందనీ, బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ ఎందుకు ఫిర్యాదు చేయడం ఆరోపించారు.
ఈ రెండు పార్టీలు తనను దూశించడమే ధ్యేయంగా పెట్టుకున్నాయని మోడీ కాంగ్రెస్, బీఆర్ఎస్ లనుద్దేశించి అన్నారు. తెలంగాణను దోచుకున్నవారిని ఎవరినీ వదలం అంటూ మోడీ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. పోలింగ్ రోజు దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణలో బీజేపీ ప్రభంజనం కనిపిస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రక్షాళన అవుతాయని వ్యాఖ్యానించారు. పొరుగున ఉన్న కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గంపై కూడా ఈ సభ ప్రభావం చూపుతుందని మోదీ భావిస్తున్నారు. ప్రస్తుతం కరీంనగర్, నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గాలు బీజేపీ ఖాతాలో ఉన్నాయి.
2019 లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 17 లోక్ సభ స్థానాలకుగాను నాలుగింటిని గెలుచుకున్న ఆ పార్టీ దక్షిణాదిలో పట్టు సాధించేందుకు ప్రస్తుత బలం పెంచుకోవాలని చూస్తోంది. గతవారం హైదరాబాద్ లోని మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించిన మోడీ.. నాగర్ కర్నూల్ లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. తెలంగాణ పర్యటన అనంతరం ఆయన కర్ణాటకలోని బహిరంగ సభ హాజరుకానున్నారు.
#WATCH | Telangana: During his public address in Jagtial, PM Modi says, "The INDI alliance in their manifesto said that their fight is against 'Shakti'. For me, every mother, daughter & sister is a form of 'Shakti'. I worship them in the form of 'Shakti'. I am the worshiper of… pic.twitter.com/ccVUoEVVNb
— ANI (@ANI) March 18, 2024
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి