Watch Video: ప్లీజ్ సార్ వెళ్లొద్దు.. ట్రాన్సఫర్ వద్దంటూ టీచర్‌ను అడ్డుకున్న స్టూడెంట్స్.. గుండెలు పిండేస్తోన్న పసి హృదయాలు..

తమ ఉపాధ్యాయుడు బదిలీ కావడాన్ని ఆ విద్యార్థులు తట్టుకోలేకపోయారు. మనన్సు గెలుచుకున్న టీచర్‌ స్కూల్‌ విడిచి వెళ్లడాన్ని అంగీకరించలేకపోయారు. స్కూల్‌ వదిలి వెళ్లొద్దని గేటు దగ్గర అడ్డుకున్నారు. ఈ ఘటన జనగామ జిల్లా శామీర్‌పేట ప్రాథమిక పాఠశాలలో జరిగింది.. సుధీర్ అనే ఉపాధ్యాయుడు మరో స్కూల్ కు బదిలీఅయ్యారు..

Watch Video: ప్లీజ్ సార్ వెళ్లొద్దు.. ట్రాన్సఫర్ వద్దంటూ టీచర్‌ను అడ్డుకున్న స్టూడెంట్స్.. గుండెలు పిండేస్తోన్న పసి హృదయాలు..
School Teacher
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 28, 2024 | 12:36 PM

తమ ఉపాధ్యాయుడు బదిలీ కావడాన్ని ఆ విద్యార్థులు తట్టుకోలేకపోయారు. మనన్సు గెలుచుకున్న టీచర్‌ స్కూల్‌ విడిచి వెళ్లడాన్ని అంగీకరించలేకపోయారు. స్కూల్‌ వదిలి వెళ్లొద్దని గేటు దగ్గర అడ్డుకున్నారు. ఈ ఘటన జనగామ జిల్లా శామీర్‌పేట ప్రాథమిక పాఠశాలలో జరిగింది.. సుధీర్ అనే ఉపాధ్యాయుడు మరో స్కూల్ కు బదిలీఅయ్యారు.. దీంతో ఆయన స్కూల్ కి వచ్చి వెళ్తున్న క్రమంలో.. పిల్లలంతా కలిసి గేటు దగ్గర అడ్డుకున్నారు. సుధీర్ సర్ ట్రాన్సఫర్ అవ్వడానికి వీల్లేదంటూ స్టూడెంట్స్ గెటుకు అడ్డుగా నిలబడి.. పసి హృదయాలతో గుండెలు పిండేశారు. వెళ్లొద్దు సార్ అంటూ కన్నీరుపెట్టారు.

వీడియో చూడండి..

సుధీర్ సర్‌.. తమకిక పాఠాలు బోధించడని తెలిసి విద్యార్థులు భావోద్వేగానికి గురయ్యారు. చిన్నారుల ప్రేమకు ఉప్పొంగిపోయిన టీచర్.. మళ్లీ వస్తా కన్నీళ్లు పెట్టుకోవద్దని సముదాయించి అక్కడి నుంచి వెళ్లిపోయారు టీచర్. ఉపాధ్యాయ వృత్తిలో ఇలాంటి ఘటన ఎప్పుడూ చూడలేదంటూ సహచరుల ముందు భావోద్వేనికి లోనయ్యారు సుధీర్. కాగా.. చిన్నారులు రోదిస్తున్న తీరుతో పలువురు భావోద్వేగానికి లోనయ్యారు.

వీడియో చూడండి..

కాగా.. టీచర్ సుధీర్ శామీర్ పేట నుంచి బదిలీపై బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి వెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..