మేడారంలో కాలకేయుడు..!
ఊరి పొలిమేర్లలో గ్రామ దేవతలు, పోతురాజులు, కాలభైరవుల విగ్రహాలు ఉండటం కామన్. కానీ, బాహుబలి సినిమాలోని కాలకేయున్ని ప్రతిష్టించడం ఎక్కడైనా చూశారా..? అది కూడా ఆ జిల్లా కలెక్టరే స్వయంగా కాలకేయుడి భారీ కాయాన్ని తయారు చేయించి పొలిమేరల్లో ప్రతిష్టించారు. అది ఎక్కడో కాదు..ఏకంగా మేడారం సరిహద్దుల్లో..ఇకపై మేడారంకు వెళ్లే ప్రతీ భక్తుడు ఆ కాలకేయున్ని దాటి వెళ్లాల్సిందే. వివరాల్లోకి వెళితే.. మేడారం జాతరను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. మేడారం జాతరలో […]
ఊరి పొలిమేర్లలో గ్రామ దేవతలు, పోతురాజులు, కాలభైరవుల విగ్రహాలు ఉండటం కామన్. కానీ, బాహుబలి సినిమాలోని కాలకేయున్ని ప్రతిష్టించడం ఎక్కడైనా చూశారా..? అది కూడా ఆ జిల్లా కలెక్టరే స్వయంగా కాలకేయుడి భారీ కాయాన్ని తయారు చేయించి పొలిమేరల్లో ప్రతిష్టించారు. అది ఎక్కడో కాదు..ఏకంగా మేడారం సరిహద్దుల్లో..ఇకపై మేడారంకు వెళ్లే ప్రతీ భక్తుడు ఆ కాలకేయున్ని దాటి వెళ్లాల్సిందే. వివరాల్లోకి వెళితే..
మేడారం జాతరను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. మేడారం జాతరలో భాగంగా.. ములుగు జిల్లా గట్టమ్మ ఆలయ పరిసరాల్లో 20 అడుగుల ప్లాస్టిక్ కాలకేయ బొమ్మను జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆవిష్కరించారు. మానవాళి మనుగడకు ముప్పుగా మారిన ప్లాస్టిక్ను జిల్లా నుంచి పారద్రోలేందుకు కృత నిశ్చయంతో ఉన్నామని కలెక్టర్ తెలిపారు. జాతరకొచ్చే భక్తులు ప్లాస్టిక్ వస్తువులు తీసుకురావటం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని… దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. జాతర ప్లాస్టిక్ రహితంగా జరిగేలా అందరూ సహకరించాలంటున్న కలెక్టర్ నారాయణరెడ్డి పిలుపునిచ్చారు.