Peddapalli Politics: టికెట్ కోసం ముగ్గురు నేతల ప్రయత్నం.. ఆశలు పెట్టుకున్న వివేక్ తనయడు..
సమీపిస్తున్న పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణలో మళ్లీ రాజకీయ వేడి రాజుకుంది. ఏ పార్టీ నుండి ఏ అభ్యర్థి పోటీ చేస్తారనే అంశంపై చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీ నుండి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేసేది ఎవరు అనే విషయంపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది.

సమీపిస్తున్న పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణలో మళ్లీ రాజకీయ వేడి రాజుకుంది. ఏ పార్టీ నుండి ఏ అభ్యర్థి పోటీ చేస్తారనే అంశంపై చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీ నుండి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేసేది ఎవరు అనే విషయంపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది.
పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో ఏకపక్ష విజయాన్ని సాధించి రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టింది కాంగ్రెస్. రాబోయే పార్లమెంట్ ఎన్నికలను సైతం అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిణమించాయి ఈ పార్టీకి. అందుకే అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి ఎవరు అనే అంశం హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఈ నియోజకవర్గం నుండి అత్యధికులు నాన్ లోకల్ అభ్యర్థులే పోటీ చేయడంతో, ఈసారి ఎన్నికల్లో లోకల్ కాండేటా..? మళ్లీ నాన్ లోకల్ క్యాండెటా..? అనే అంశంపై చర్చ కొనసాగుతోంది.
గత పార్లమెంటు ఎన్నికల్లో వికారాబాద్‌కు చెందిన మాజీ మంత్రి ఆగం చంద్రశేఖర్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పటి ఎన్నికల్లో BRS అభ్యర్థి బోర్లకుంట వెంకటేష్ నేతకాని విజయం సాధించారు. అత్యధిక ఓట్లను సాధించి, ఆగం చంద్రశేఖర్ సమీప ప్రత్యర్థిగా రెండో స్థానంలో నిలిచారు. ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ వెంకటస్వామి మనుమడు, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తనయుడు గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జోరుగా కొనసాగుతోంది. అయితే జరుగుతున్న ప్రచారానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వంశీకృష్ణ వైపే మొగ్గుచూపుతుందా..? లేదంటే గతంలో ఇక్కడి నుండి పోటీ చేసి సత్తా చాటుకున్న ఆగం చంద్రశేఖర్ కు మరో మారు అవకాశాన్ని కల్పిస్తుందా అనే అంశం చర్చనీయాంశంగా మారింది.
జిల్లా మంత్రిగా ఉన్న దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఈ ప్రాంత పార్లమెంట్ స్థానంపై ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశాలు ఉన్న దరిమిలా వారిద్దరిని కాదని మరో అభ్యర్థిని రంగంలోకి దింపుతారా అనే చర్చ కూడా కొనసాగుతోంది. గడ్డం వంశీ కృష్ణకు పెద్దపల్లి ఎంపీ టికెట్ ను కేటాయిస్తే రాజకీయ వారసత్వంతో పాటు లోకల్ క్యాండేట్ అనే అస్త్రంతో బయటపడవచ్చనే అభిప్రాయాలు పలువురు నుండి వ్యక్తమవుతున్నాయి. అలా కాదని ఇతరులను ఇక్కడి నుండి పోటీ చేయిస్తే నాన్ లోకల్ క్యాండేట్ అనే ముద్ర పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు BRS పార్టీ స్థానికుడైన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను ఇక్కడి నుండి ఎంపీగా బరిలోకి దింపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం..
ఈ నేపథ్యంలో పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలను క్లీన్ స్వీప్ చేసిన కాంగ్రెస్ అధిష్టానం పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి ఎంపికపై తీసుకోబోయే నిర్ణయం సర్వత్ర ఆసక్తికరంగా మారింది. ఈ నియోజకవర్గంలో సింగరేణి కార్మికులు అధికంగా ఉన్నారు. దీంతో కార్మికుల్లో పట్టున్న నేత కోసం దృష్టి పెడుతున్నారు పార్టీ నేతలు. ఈ సీట్లో విజయం సాధిస్తామనే ధీమాతో కాంగ్రెస్ ఉంది. పూర్తిగా విభేదాలు పక్కన పెట్టి బలమైన అభ్యర్థిని రంగంలో దింపే ఆలోచనలో ఉంది కాంగ్రెస్..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..