Hyderabad: నిఘా నీడలో ఉప్పల్ స్టేడియం.. భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్‌కు పటిష్ట భద్రత: రాచకొండ కమీషనర్ సుధీర్ బాబు
India vs England 1st Test: భారత్ జట్టు ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ టెస్ట్ సిరీస్ జనవరి 25 నుంచి ప్రారంభమై, మార్చి 11 వరకు కొనసాగుతుంది. అలాగే, ఇంగ్లండ్ జట్టు జనవరి మరికొద్దిరోజుల్లో భారత్‌కు రానుంది. 3 ఏళ్ల తర్వాత భారత్‌లో ఇరు జట్ల మధ్య టెస్టు సిరీస్ జరగనుంది. ఇరుజట్లు 2021లో చివరిసారి తలపడ్డాయి. అయితే, ఈ సిరీస్‌ను టీమిండియా 3-1 తేడాతో దక్కించుకుంది. అయితే, తొలి టెస్టు జనవరి 25 నుంచి హైదరాబాద్‌లో జరగనుంది.

IND vs ENG 1st Test: జనవరి 25 నుంచి 29 వరకు 5 రోజులపాటు ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ క్రికెట్ మ్యాచ్ నిర్వహణకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఓ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో ఐపీఎస్ రాచకొండ డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
భద్రతపై సమీక్షా సమావేశం..
ఈ మేరకు సీపీ సుధీర్ బాబు మాట్లాడుతూ, రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగనున్న టెస్ట్ మ్యాచ్ నిర్వహణకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సెక్యూరిటీ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లతోపాటు, ప్రేక్షకులకు అసౌకర్యం కలుగకుండా చూడాలని అధికారులను కోరారు. టికెట్ల విషయంలో ఇంతకుముందు జరిగిన పొరపాట్లు లేకుండా చూడాలని, హెచ్‌సీఏ ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు.
మ్యాచ్ చూసేందుకు వచ్చే ప్రేక్షకుల వాహానాలకు అవసరమైన పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని సీపీ సూచించారు. అలాగే, స్టేడియం పరిసరాల్లో సీసీటీవీలను ఏర్పాటు చేయాలని తెలిపారు. టికెట్ల పంపిణీ పూర్తి పారదర్శకంగా జరిగేలా చూడాలని కోరారు.
జనవరి 25 నుంచి టెస్ట్ సిరీస్..
భారత్ జట్టు ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ టెస్ట్ సిరీస్ జనవరి 25 నుంచి ప్రారంభమై, మార్చి 11 వరకు కొనసాగుతుంది. అలాగే, ఇంగ్లండ్ జట్టు జనవరి మరికొద్దిరోజుల్లో భారత్‌కు రానుంది. 3 ఏళ్ల తర్వాత భారత్‌లో ఇరు జట్ల మధ్య టెస్టు సిరీస్ జరగనుంది. ఇరుజట్లు 2021లో చివరిసారి తలపడ్డాయి. అయితే, ఈ సిరీస్‌ను టీమిండియా 3-1 తేడాతో దక్కించుకుంది. అయితే, తొలి టెస్టు జనవరి 25 నుంచి హైదరాబాద్‌లో జరగనుంది.
భారత్ – ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ పూర్తి షెడ్యూల్..
1వ టెస్టు: భారత్ వర్సెస్ ఇంగ్లండ్, జనవరి 25-29, హైదరాబాద్ (రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం)
2వ టెస్టు: భారత్ వర్సెస్ ఇంగ్లండ్, ఫిబ్రవరి 2-6, విశాఖపట్నం (డా. వైఎస్ రాజశేఖర్ క్రికెట్ స్టేడియం)
3వ టెస్టు: భారత్ వర్సెస్ ఇంగ్లండ్, ఫిబ్రవరి 15- 19 ఫిబ్రవరి, రాజ్‌కోట్ (సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం)
4వ టెస్ట్: భారత్ వర్సెస్ ఇంగ్లండ్, ఫిబ్రవరి 23-27, రాంచీ (JSCA ఇంటర్నేషనల్ స్టేడియం)
5వ టెస్ట్: భారత్ వర్సెస్ ఇంగ్లాండ్, మార్చి 7-11, ధర్మశాల (హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం).
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..