Video: క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు.. మైదానంలోనే కుప్పకూలిన క్రికెటర్.. వైరల్ వీడియో
ఈ ప్లేయర్ టీం బ్యాటింగ్ చేస్తుంది. కాగా, వికాస్ నేగి నాన్ స్ట్రైక్‌లో నిలుచున్నాడు. స్ట్రైకింగ్‌లోని బ్యాటర్ బంతిని గట్టిగా కొట్టాడు. ఈ క్రమంలో ఇరువురు బ్యాటర్లు రన్ తీసేందుకు సిద్ధమయ్యారు. అయితే, బంతి బౌండరీ వెళ్లడంతో.. రన్నింగ్ ఆపేశారు. నడుచుకుంటూ ఒకరినొకరు దగ్గరై బ్యాట్ హ్యాండ్ చేసుకున్నారు. ఆ తర్వాత తిరిగి క్రీజులోకి వచ్చే సమయంలో ఒక్కసారిగా పిచ్‌పై వికాస్ నేగి కుప్పకూలిపోయాడు.

Viral Video: దేశంలో గుండెపోటు కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా కొంత మంది పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నప్పటికీ హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలి పోవడం, ఆ క్షణంలోనే మరణిస్తున్నట్లు తరచుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి విషాద సంఘటనే నోయిడాలో చోటు చేసుకుంది. మ్యాచ్ మధ్యలో 36 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలిపోయి, అక్కడిక్కడే మరణించడం చూసి, సహచరులు కన్నీరు మున్నీరయ్యారు.
నోయిడాలోని థానా ఎక్స్‌ప్రెస్‌వే సెక్టార్-135 ప్రాంతంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీలో ఉత్తరాఖండ్‌కు చెందిన వికాస్ నేగి ఆడుతున్నారు.
ఈ ప్లేయర్ టీం బ్యాటింగ్ చేస్తుంది. కాగా, వికాస్ నేగి నాన్ స్ట్రైక్‌లో నిలుచున్నాడు. స్ట్రైకింగ్‌లోని బ్యాటర్ బంతిని గట్టిగా కొట్టాడు. ఈ క్రమంలో ఇరువురు బ్యాటర్లు రన్ తీసేందుకు సిద్ధమయ్యారు. అయితే, బంతి బౌండరీ వెళ్లడంతో.. రన్నింగ్ ఆపేశారు. నడుచుకుంటూ ఒకరినొకరు దగ్గరై బ్యాట్ హ్యాండ్ చేసుకున్నారు. ఆ తర్వాత తిరిగి క్రీజులోకి వచ్చే సమయంలో ఒక్కసారిగా పిచ్‌పై వికాస్ నేగి కుప్పకూలిపోయాడు.
వెంటనే ప్రత్యర్థి జట్టు వికెట్ కీపర్, సహచర ఆటగాడు వికాస్ నేగి వద్దకు పరుగు పరుగున వచ్చారు. ఆ తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే వికాస్ నేగి మరణించాడని డాక్టర్ తెలిపారు.
వైరలవుతోన్న వీడియో..
Shocking Video: Cricketer Collapses On The Pitch And Dies Of Heart Attack.
Vikas Negi, with the tragic incident occurring in NOIDA in the match between Mavericks XI and Blazing Bulls. Players had tried to perform CPR, but he was pronounced dead.#HeartAttack #NOIDA #ViralVideo pic.twitter.com/dMQrdma52F
— AH Siddiqui (@anwar0262) January 9, 2024
పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించగా గుండెపోటుతో మృతి చెందినట్లు తేలింది. అంతకుముందు, వికాస్ నేగి కోవిడ్ ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్నాడు. అయితే ఆయన పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని బంధువులు తెలిపారు. దీంతో సహచరులతోపాటు, బంధువులు విషాదంలో మునిగిపోయారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..