IND vs AFG: ఆఫ్ఘనిస్తాన్‌కు బ్యాడ్‌న్యూస్.. భారత్‌తో టీ20 సిరీస్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్..
India vs Afghanistan T20I Series: జనవరి 11 నుంచి భారత్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల T20 సిరీస్ (IND vs AFG) జరగనుంది. ఇందులో మొదటి మ్యాచ్ మొహాలీలో జరుగుతుంది. ఈ మేరకు ఇరుజట్లు ఇప్పటికే తమ స్వ్కాడ్‌లను ప్రకటించాయి. అలాగే, మొహాలీకి చేరుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. అయితే, ఇంతలో ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Rashid Khan Ruled Out: సొంతగడ్డపై తొలిసారిగా ద్వైపాక్షిక సిరీస్‌కి ఆఫ్ఘనిస్థాన్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సిద్ధమైంది. జనవరి 11 నుంచి రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల T20 సిరీస్ (IND vs AFG) జరగనుంది. ఇందులో మొదటి మ్యాచ్ మొహాలీలో జరుగుతుంది. అయితే, ఈ సిరీస్ ప్రారంభం కాకముందే అఫ్గానిస్థాన్ ఆటగాడు రషీద్ ఖాన్ ఔట్ అయ్యాడనే వార్త బయటకు వస్తోంది. ఇప్పటికే అతనికి ఆడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆఫ్గానిస్తాన్ స్టార్ ప్లేయర్ ఔట్ అని ధృవీకరణ అయింది.
రషీద్ ఖాన్ ఇటీవల వెన్నులో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. దాని నుంచి పూర్తిగా కోలుకోలేకపోయాడు. ఈ కారణంగా ఇటీవల యూఏఈతో జరిగిన టీ20 సిరీస్‌లో అతడిని ప్రధాన జట్టులోకి తీసుకోలేదు. అదే సమయంలో భారత్‌తో జరిగే టీ20 సిరీస్‌కు జట్టులో ఉన్నప్పటికీ అతనికి ఆడే అవకాశాలు తక్కువేనని తేలింది. నిన్న, ఆఫ్ఘనిస్తాన్ ట్రైనింగ్ సెషన్ వీడియో కూడా విడుదలైంది. అందులో అతను బౌలింగ్, బ్యాటింగ్ చేయడం కనిపించింది. అయితే, మ్యాచ్‌కు ఒక రోజు ముందు, తాత్కాలిక కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ రషీద్ ఖాన్ మినహాయింపు గురించి సమాచారం అందించాడు.
📸📸: Snapshots from AfghanAtalan's practice session as they gear up for the three-match T20I series against @BCCI, starting tomorrow in Mohali. 🤩#AfghanAtalan | #INDvAFG2024 | @EtisalatAf | @LavaMobile | @IntexBrand pic.twitter.com/NkXaq8tn9m
— Afghanistan Cricket Board (@ACBofficials) January 10, 2024
స్పోర్ట్‌స్టార్ వార్తల ప్రకారం, రషీద్ గురించి జద్రాన్ మాట్లాడుతూ, “అతను పూర్తిగా ఫిట్‌గా లేడు. కానీ, జట్టుతో ప్రయాణిస్తున్నాడు. అతను వీలైనంత త్వరగా ఫిట్ అవుతాడని మేం ఆశిస్తున్నాం. అతను వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. అతని సేవలు సిరీస్‌లో కోల్పోతాం” అంటూ చెప్పుకొచ్చాడు.
అయితే, రషీద్ ఖాన్ లేకపోయినా భారత జట్టును ధీటుగా ఎదుర్కొనే సత్తా తమ జట్టుకు ఉందని ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ విశ్వాసం వ్యక్తం చేశాడు. “రషీద్ లేకుండా, కొంతమంది ఆటగాళ్లపై మాకు నమ్మకం ఉంది. వారు మంచి క్రికెట్ ఆడతారని నేను చెప్పగలను. ఇతర ఆటగాళ్లు కూడా చాలా క్రికెట్ ఆడారు. వారు బాగా రాణిస్తారని నేను నమ్ముతున్నాను. రషీద్ లేకుండా మేం పోరాడతాం” అంటూ చెప్పుకొచ్చాడు.
భారత్ – ఆఫ్గానిస్థాన్ టీ20ఐ సిరీస్..
11 జనవరి- 1వ టీ20, మొహాలీ
14 జనవరి- రెండవ టీ20, ఇండోర్
17 జనవరి- 3వ టీ20, బెంగళూరు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




