Arjuna Award: అర్జున అవార్డ్ అందుకోని టీమిండియా స్టార్ ప్లేయర్స్ వీరే.. టాప్ 5 లిస్టు ఇదే..

Team India: భారత పేస్ బౌలర్ మహమ్మద్‌ షమీ దేశ రెండవ అత్యున్నత క్రీడా పురస్కారం అర్జున అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. మంగళవారం (జనవరి 10) ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా షమీ అర్జున అవార్డును అందుకున్నాడు. అయితే, ఇప్పటి వరకు దేశ 2వ అత్యున్నత క్రీడా పురస్కారాన్ని అందుకోలేకపోయిన స్టార్ క్రికెటర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

Venkata Chari

|

Updated on: Jan 10, 2024 | 4:54 PM

టీమిండియా పేసర్ మహ్మద్ షమీకి అర్జున అవార్డు లభించింది. మంగళవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది మార్ము చేతుల మీదుగా షమీ దేశ 2వ అత్యున్నత క్రీడా పురస్కారాన్ని అందుకున్నాడు. అయితే, ధోనీ సహా కొందరు ఆటగాళ్లు మాత్రం అర్జున అవార్డును అందుకోలేకపోయారు. ఇప్పటి వరకు దేశ 2వ అత్యున్నత క్రీడా పురస్కారాన్ని అందుకోలేకపోయిన స్టార్ క్రికెటర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
Krishnamachari Srikanth: భారత మాజీ ఆటగాడు కృష్ణమాచారి శ్రీకాంత్ భారత్ తరపున టెస్టుల్లో 2,062 పరుగులు, వన్డేల్లో 4,091 పరుగులు చేశాడు. అతను 1983 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో కూడా సభ్యుడిగా నిలిచాడు. అయితే, అర్జున అవార్డుకు ఎంపిక కాలేదు.

2 / 5
Suresh Raina: టీమిండియా తరపున మూడు ఫార్మాట్లలో సెంచరీలు సాధించిన తొలి భారతీయుడిగా సురేశ్ రైనా రికార్డు సృష్టించాడు. 2011లో భారత జట్టు ప్రపంచకప్‌ గెలవడంలో రైనా తన వంతు సహకారం అందించాడు. అంతేకాకుండా ఎలాంటి వివాదాలు లేకుండా క్రికెట్ కెరీర్ ముగించిన రైనాకు అర్జున అవార్డు కూడా దక్కలేదు.

3 / 5
Ashish Nehra: టీమిండియా తరపున 18 ఏళ్ల పాటు ఆడిన లెఫ్టార్మ్ పేసర్ ఆశిష్ నెహ్రా 235 వికెట్లు పడగొట్టాడు. అయితే, అర్జున అవార్డు గ్రహీతల జాబితాలో మాత్రం అతను కనిపించలేదు.

4 / 5
Mahendra Singh Dhoni: మూడు ఐసీసీ ట్రోఫీలు గెలుచుకున్న ఏకైక కెప్టెన్, క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీకి అర్జున అవార్డు రాలేదు. అయితే, ధోనీ దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అందుకున్నాడు.

5 / 5
Follow us