BRS Candidates: ఈ ముగ్గురికి టికెట్ ఇవ్వద్దు.. పెద్దపల్లి బీఆర్ఎస్‌లో టికెట్ల పంచాయతీ..
ఎమ్మెల్యే అభ్యర్థులను అనౌన్స్ సిద్దమవుతుంటే.. మరోవైపు ఆ ఎమ్మెల్యేలు మాకు వద్దు అంటూ పార్టీ శ్రేణులు అసమ్మతి గళాలు వినిపిస్తున్నారు. పార్టీ శ్రేణులకు.. ఎమ్మెల్యేలకు మద్య గ్యాప్ పెరగడమే అంతర్గత విభేధాలకు కారణం కాగా.. అధిష్టానం బుజ్జగిస్తున్నా అసమ్మతి నేతలు సమ్మతించడం లేదు. పార్టీ బలంగా ఉన్నా.. అసమ్మతి నేతల తీరుతో ఎమ్మెల్యే అభ్యర్థులు పరేషాన్ అవుతున్నారు. ఇంతకీ ముదురుతున్న ఇంటర్నల్ వార్ ఎటువైపు..

ఓ వైపు అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థులను అనౌన్స్ సిద్దమవుతుంటే.. మరోవైపు ఆ ఎమ్మెల్యేలు మాకు వద్దు అంటూ పార్టీ శ్రేణులు అసమ్మతి గళాలు వినిపిస్తున్నారు. పార్టీ శ్రేణులకు.. ఎమ్మెల్యేలకు మద్య గ్యాప్ పెరగడమే అంతర్గత విభేధాలకు కారణం కాగా.. అధిష్టానం బుజ్జగిస్తున్నా అసమ్మతి నేతలు సమ్మతించడం లేదు. పార్టీ బలంగా ఉన్నా.. అసమ్మతి నేతల తీరుతో ఎమ్మెల్యే అభ్యర్థులు పరేషాన్ అవుతున్నారు. ఇంతకీ ముదురుతున్న ఇంటర్నల్ వార్ ఎటువైపు దారి తీస్తుంది. అధిష్టానం టిక్కెట్లు ఓకే చేస్తే పరిస్థితి ఏంటి?
రామగుండంలో పుట్టిన అసమ్మతి మంటలు.. పెద్దపల్లికి పాకాయి. తరువాత పోరుగున ఉన్న మంథని నియెజకవర్గానికి వ్యాపించాయి. మొదటిసారి మంథని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జడ్పి చైర్మన్ పుట్ట మధుకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలు సమావేశం నిర్వహించారు. పుట్ట మధుకు టిక్కెట్ ఇవ్వొద్దంటూ తమ ప్రధాన డిమండ్‌ను వినిపించారు వ్యతిరేక వర్గీయులు. ఓ వర్గం నేతలంతా మధుకు టిక్కెట్ ఇవ్వవద్దంటు మీటింగ్ పెడితే.. ఈసారి పుట్ట మధుకే టిక్కెట్ ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తున్నారు ఆయన ఫాలోవర్స్.
2014 ఎన్నికల్లో పుట్ట మధు బిఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించగా.. 2018 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ అధిష్టానం మధుకు పెద్దపల్లి జడ్పి చైర్మన్ పదవినిచ్చింది. అయితే మంథనిలో పార్టీకోసం, తెలంగాణ సాధన కోసం పోరాడిన ఉద్యమకారులను మధు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆయన అనుచరులు వ్యవహరిస్తున్న తీరుతో పార్టీకి చెడ్డ పేరు వస్తుందంటున్నారు కరుడుగట్టిన గులాభి నేతలు. మంథని నియోజకవర్గంలో అధికారపార్టీ నేతలను, కార్యకర్తలను, సోషల్ మీడియా వేదికగా బూతు పురాణం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అసమ్మతి నేతలు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మంథని నియోజకవర్గ బీఆర్ఎస్ టికెట్ పుట్ట మధుకు ఇవ్వకూడదని కేసీఆర్, కేటీఆర్‌కు త్వరలో విన్నవిస్తమంటున్నారు అసమ్మతి నేతలు. తమ విన్నపం కాదని పుట్ట మధుకు టికెట్ ఇస్తే సహకరించబోమంటున్న నాయకులంతా తేల్చి చెబుతున్నారు. వేరే ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపిస్తామని హమీ ఇస్తున్నారు.




పుట్ట మధు పార్టీ లైన్‌లో కాకుండా అందర్నీ కలుపుకోకుండా ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకొని వ్యక్తిగత ఎజెండాతో వెళ్తున్నారని ఓపెన్ గానే ఆరోపిస్తున్నారు రెబల్స్. ఇదే చివరి అవకాశం అని పుట్ట మధు అంటుంటే.. నో మోర్ ఛాన్స్ అంటున్నారు అసమ్మతి నేతలు. ఇంటి పోరు మధు పోలిటికల్ జర్నీ ఎటు వైపు తీసుకెళ్తుందో అనే చర్చ సాగుతుంది. మంథని, రామగుండం, పెద్దపల్లి నియోజకవర్గంలో అసమ్మతి వాదుల డిమాండ్ నెరువెరుతుందో.. సిట్టింగ్ లకే సీట్లు కన్పామ్ అవుతాయో లేదో వేచి చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..