AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పిలిచి మరి తిట్టించుకున్న కాంగ్రెస్.. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ‌పై రేవంత్ మాటలు చిచ్చు..

టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీలో మరోసారి తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇప్పటికే ఎస్సీల మద్దతు కోసం మందకృష్ణని గాంధీ భవన్ పిలిచి నాలుక కరుచుకున్నట్లయిందట. ఎస్సీల మద్దతేమో గాని గాంధీ భవన్ మీడియా హల్‌లో మందకృష్ణ కాంగ్రెస్ పై విమర్శలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. గతంలో ఎస్సి వర్గీకరణ చేస్తాంటే మద్దతు ఇచ్చామని, 10 ఏళ్ళు అధికారంలో ఉండి బిల్లు పెట్టకపోగా ఇప్పుడు 9 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి అధికార పార్టీపై ఒత్తి చేయాలకపోగా మోసం చేశాయని మందకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. దీంతో మందకృష్ణని పిలిచి తిట్టించుకున్నట్లయిందని..

Telangana: పిలిచి మరి తిట్టించుకున్న కాంగ్రెస్.. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ‌పై రేవంత్ మాటలు చిచ్చు..
Telangana Congress
Ashok Bheemanapalli
| Edited By: Ram Naramaneni|

Updated on: Aug 18, 2023 | 3:01 PM

Share

టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీలో మరోసారి తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇప్పటికే ఎస్సీల మద్దతు కోసం మందకృష్ణని గాంధీ భవన్ పిలిచి నాలుక కరుచుకున్నట్లయిందట. ఎస్సీల మద్దతేమో గాని గాంధీ భవన్ మీడియా హల్‌లో మందకృష్ణ కాంగ్రెస్ పై విమర్శలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. గతంలో ఎస్సి వర్గీకరణ చేస్తాంటే మద్దతు ఇచ్చామని, 10 ఏళ్ళు అధికారంలో ఉండి బిల్లు పెట్టకపోగా ఇప్పుడు 9 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి అధికార పార్టీపై ఒత్తి చేయాలకపోగా మోసం చేశాయని మందకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. దీంతో మందకృష్ణని పిలిచి తిట్టించుకున్నట్లయిందని గాంధీ భవన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మందకృష్ణ అక్కడితో ఆగకపోగా తాము వినతిపత్రం ఇస్తే ఎలాంటి హామీ ఇవ్వకపోగా అవమానపరిచే విధంగా రేవంత్ మాట్లాడారంటు మందకృష్ణ వ్యాఖ్యలు చేశారు.

ఇక ఇది మరువకముందే తమ ప్రభుత్వం వస్తే ఎస్టీ వర్గీకరణ చేస్తామంటూ రేవంత్ చేసినా వ్యాఖ్యలు సొంత పార్టీ నేతలే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తారు.. ఎస్టీ వర్గీకరణ ఎవరు అడిగారని ఎస్టీ వర్గీకరణ తేనే తుట్ట ని రేవంత్ కదిపారని మండిపడుతున్నారు. ఎస్టీలో దాదాపు 30 కి పైగా కులాలు ఉండగా మెజారిటీ లంబాడా తెగకి చెందిన వారు ఉన్నారు. రేవంత్ ఎస్టీ వర్గీకరణ చేస్తామని చెప్పడ్డం వల్ల లంబాడాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ వ్యాఖ్యల వల్ల లంబాడలు అధికంగా ఉండే 40 నియోజకవరర్గాల పై తీవ్ర ప్రభావం చూపుతుందని రేవంత్ వ్యాఖ్యలు లంబాడాలను కాంగ్రెస్ కి దూరం చేసే ప్రయత్నం అని మండిపడుతున్నారు.

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అంశం దశబ్దాలుగా పెండింగ్‌లో ఉండగా అదే ఎటు తేల్చుకోలేక తలలు పట్టుకుంటుంటే.. మద్దతు కోసం అంటూ మందకృష్ణని గాంధీ భవ‌న్‌కి పిలిచి డ్యామేజ్ చేసుకోగా.. ఇప్పుడు అసలు చర్చే లేని ఎస్టీ వర్గీకరణ అంశాన్ని తేర మీదకి తేవడంతో వివాదం ముదురుతుంది. కాంగ్రెస్ మెజారిటీ సీట్లు గెలిచే ఎస్సి, ఎస్టీ నియోజకవర్గల్లో రేవంత్ మాటలు ప్రతికులంగా మారే అవకాశం ఉందని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఎస్టీ వర్గీకరణ కి సంబందించిన వ్యాఖ్యల పై ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే ని కలిసి పిర్యాదు చేయాలనీ తెలంగాణ కాంగ్రెస్ ఎస్టీ నేతలు ఆలోచిస్తున్నారట.

ఇవి కూడా చదవండి

ఈ మధ్య కాలంలో అమెరికా లో ఉచిత విద్యుత్ అంశం, సీతక్క సీఎం అంటూ వ్యాఖ్యలు, ఎస్టీ వర్గీకరణ అంశం, గతంలో పిచ్చకుంట్లోళ్ళు అంటూ చేసిన వ్యాఖ్యలు,రెడ్డి లు అంటూ చేసిన వ్యాఖ్యలు ఇలా రేవంత్ ఏ వ్యాఖ్యలు చేసిన కాంట్రవర్సీ గా మారుతున్నాయి.. ఇప్పుడు ఎన్నికల సమయంలో ఇలా మాట్లాడితే పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉండడం తో అధిష్టానం ఎలా వ్యవహరిస్తుందో చూడాలి మరి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..