Variety toddy: చిలుక తాగిన కల్లు.. భలే టేస్ట్ అంటున్న కల్లు ప్రియులు.. తెలంగాణలోని ఆ ప్రాంతానికి క్యూ
చిలక కొట్టిన జామపండు భలే తియ్యగా ఉంటుందని అంటారు..అంతేకాదు, ఇప్పుడు, చిలుక తాగిన కల్లు కూడా ఇంకా మధురంగా ఉంటుందని చెబుతున్నారు కల్లు ప్రియులు...
Variety toddy: చిలక కొట్టిన జామపండు భలే తియ్యగా ఉంటుందని అంటారు..అంతేకాదు, ఇప్పుడు, చిలుక తాగిన కల్లు కూడా ఇంకా మధురంగా ఉంటుందని చెబుతున్నారు కల్లు ప్రియులు. సీజనల్‌గా దొరకుతుంది కాబట్టి దాన్ని తాగేందుకు ఎగబడుతున్నారు.
తాటి కల్లు తాగేందుకు మనుషులే కాదు, రామచిలుకలు కూడా ఎగబడుతున్నాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల గ్రామంలో రామచిలుక తాగిన కల్లు తాగేందుకు మద్యం ప్రియులు క్యూ కడుతున్నారు. చిలక కొట్టిన ఏ పండైనా తియ్యగా ఉంటుందని, ఆ పండును తినేందుకు చాలామంది ఇష్టపడతారు. అలానే…ఇక్కడ చిలుక తాగిన తాటికల్లును తాగేందుకు కూడా కల్లు ప్రియులు ఆసక్తి చూపుతున్నారు.
రామ చిలుక తాటి చెట్టు గెల నుంచి వచ్చే కల్లును టేస్ట్ చేయడంతో ఆ కళ్లు అమృతం లాగా మారుతుందని, చాలా మధురంగా ఉంటుందని కల్లు ప్రియులు అంటున్నారు. అలాంటి రామచిలుకలు ఎంగిలి చేసిన కల్లును తాగితే చాలా మంచిదని, ఆ తాటి కల్లు తాగేందుకు ఇష్టపడుతున్నారు. గీత కార్మికులను సైతం…రామ చిలుకలు ఎంగిలి చేసిన కల్లు ఉందా? అని అడిగి మరీ తాగుతున్నారు. ఈ రామచిలుకలు తాగిన కల్లుకు భలే డిమాండ్ ఏర్పడింది. డిమాండ్‌ను బట్టి రేటు కూడా కాస్త ఎక్కువే. అంతేకాదు ఈ కల్లు ఏడాదిలో రెండు నెలల పాటే దొరుకుతుందట.
Also Read:
ఐడియా అదుర్స్.. మొక్కజొన్న పంటను కాపాడుకోడానికి రైతన్నల క్రేజీ ప్లాన్స్.. ఏం చేస్తున్నారంటే..