Telangana: మందుబాబులూ.. ఖబర్దార్.! ఇక్కడ సిట్టింగ్ వేస్తే తాట తీస్తా..

ఓ రైతు వినూత్నంగా ఆలోచించాడు. మందుబాబులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. తన తోటలో సిట్టింగ్ వేస్తే తాట తీస్తానని హెచ్చరిక జారీ చేసి ఓ ఫ్లెక్సి పెట్టాడు. ఇంతకీ ఆ స్టోరీ ఏంటంటే..

Telangana: మందుబాబులూ.. ఖబర్దార్.! ఇక్కడ సిట్టింగ్ వేస్తే తాట తీస్తా..
Viral
Follow us
N Narayana Rao

| Edited By: Ravi Kiran

Updated on: Nov 11, 2024 | 1:18 PM

సాధారణంగా మనం ఇతరుల కనుదిష్టి కలగకుండా పంట పొలాల్లో అందమైన హీరోయిన్లు సన్నీ లియాన్, అనుష్క, కత్రినా కైఫ్ ఫోటోస్ పెడుతుండటం చూస్తూనే ఉంటాం. కానీ నా తోటలో మందేస్తే పోలీసులకు పట్టిస్తా అని ఫ్లెక్సీ కట్టి, ట్రెండ్ సెట్ చేశాడు ఓ రైతు. నా తోటలో మందు కొడితే పోలీసులకు చెప్తా.. ఈ డైలాగ్ ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో ట్రెండీగా మారింది. దమ్మపేట మండల కేంద్రానికి చెందిన కోట. రాజీవ్ అనే పామాయిల్ రైతు తన పొలంలో ఇలా ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. తన తోటలో ఎవరైనా మద్యపానం చేస్తే పోలీసులకు సమాచారం ఇస్తానని పేర్కొన్నాడు. ఇప్పుడు ఆ ఫ్లెక్సీ వైరల్‌గా మారింది. మిగిలిన వ్యవసాయ పంటల మాదిరి పామాయిల్ రైతులు తోటలో ప్రతిరోజు ఉండరు. అభివృద్ధి చెందుతున్న ఆధునికత ఆధారంగా రోజు డ్రిప్ ఇరిగేషన్ సిస్టం, ఆటో స్ట్రాటర్స్ ద్వారా పామాయిల్ మొక్కకి నీరు పెట్టి వెళ్లిపోతుంటారు రైతులు. అయితే ఇదే అదునుగా భావించిన మందుబాబుల కొందరు పామాయిల్ తోటలను ఆగమాగం చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానిక పామాయిల్ రైతులు.

ఇది చదవండి: గోరుముద్ద నుంచే బ్యాక్టీరియా.! ఆ తర్వాత క్యాన్సర్‌గా..!!

వరి, మొక్కజొన్న చేనులలో అడవి పంది దూరి పంటను నాశనం చేసినట్టు.. మందుబాబుల పామాయిల్ తోటలో సిట్టింగ్ వేసి సీసాలు పగలగొడుతూ.. సిగరెట్లు అంటించి పడేయటం, డిస్పోజబుల్ గ్లాసులు.. ఇలా నానా ఆగం చేసిపోతున్నారు. దీనితో రైతుకు చిర్రెత్తుకొచ్చింది. నా తోటలో మందు కొడితే పోలీసులకు పట్టిస్తానని వార్నింగ్ ఇస్తూ ఇలా ఫ్లెక్సీ కట్టాడు. ఇది చూసిన వాళ్లంతా ఈ ఐడియా ఏదో బాగుంది అని మాట్లాడుకోవటం ప్రారంభించారు. దీనితో ఇప్పడు ఈ ఫ్లెక్సీ లోకల్‌గా వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: చేపల కోసం వేటకు వెళ్తే.. గాలానికి చిక్కింది చూసి గుండె గుభేల్

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..