AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: జాతివైరం మరచి.. పిల్లికూన పట్ల కోతి చూపిస్తున్న ప్రేమకు ఫిదా..!

నిత్యం సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. వాటిలో కొన్ని నవ్వు పుట్టిస్తుంటే మరి కొన్ని.. ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఈ వీడియోల్లో జంతువులకు సంబంధించినవి అధికంగా ఉండడం విశేషం. జాతి వైర్యం మర్చిపోయి జంతువులు చేసే స్నేహానికి సంబంధించి నెటింట్లో అనేక వీడియోలు ఆకట్టుకుంటుంటాయి. అలాంటిదే ప్రస్తుతం ఇక్కడ మరో వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Baby Kitten And Monkey
N Narayana Rao
| Edited By: Balaraju Goud|

Updated on: Aug 02, 2025 | 9:11 AM

Share

నిత్యం సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. వాటిలో కొన్ని నవ్వు పుట్టిస్తుంటే మరి కొన్ని.. ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఈ వీడియోల్లో జంతువులకు సంబంధించినవి అధికంగా ఉండడం విశేషం. జాతి వైర్యం మర్చిపోయి జంతువులు చేసే స్నేహానికి సంబంధించి నెటింట్లో అనేక వీడియోలు ఆకట్టుకుంటుంటాయి. అలాంటిదే ప్రస్తుతం ఇక్కడ మరో వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

మనుషుల మాదిరిగానే పశుపక్ష్యాదులకు కూడా ప్రేమాభిమానాలు ఉంటాయి. మనుషులు మాటలతో షేర్‌ చేసుకుంటే జంతువులు వాటి చేతలతో నిరూపిస్తాయి. ఈ వీడియోలో ఒక వానరం జాతివైరాన్ని మరిచి ఓ పిల్లికూనను చేరదీసి కన్నబిడ్డలా సాకుతోంది. క్షణం కూడా విడవకుండా ఆ పిల్లి కూనను అంటిపెట్టుకునే ఉంటోంది. పిల్లిపిల్ల కూడా కోతిని తన తల్లిలాగే భావిస్తూ దాని ఒడిలో హాయిగా నిద్రపోతోంది. కోతి, పిల్లి కూనను ఎత్తుకొని అటు ఇటు తిప్పుతూ కనిపించింది.

ఖమ్మం జిల్లా ఎన్కూర్ మండలం గార్లవొడ్డు శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వద్ద ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఈ దృశ్యం ఆలయానికి వచ్చే భక్తులను, స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ పిల్లికూన పట్ల కోతి చూపిస్తున్న ప్రేమకు నెటిజన్లు సైతం ఫిదా అయిపోతున్నారు. తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా

ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా

ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!

మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..

రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..

సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా

ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా

హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?

సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే