AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఆన్‌లైన్‌లో ఆయిల్‌ క్యాన్ ఆర్డర్ చేపిన కస్టమర్.. తీరా వచ్చాక ఓపెన్ చేయగా..

నగరంలో రోజురోజుకూ కల్తీ రాయుళ్లు ఎక్కవైపోతున్నారు. కాసులకు కక్కుర్తి పడి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. మరికొందరేమో ప్యాకెట్‌లోని పదార్థాలను మాయం చేసి నాసిరకం వస్తువులను పెట్టి జనాలను మోసం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో వెలుగు చూసింది. ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్ జెప్టో నుంచి ఆయిల్ బాటిల్ ఆర్డర్ చేసిన కస్టమర్‌కు ఊహించని పరిణామం ఎదురైంది.

Viral Video: ఆన్‌లైన్‌లో ఆయిల్‌ క్యాన్ ఆర్డర్ చేపిన కస్టమర్.. తీరా వచ్చాక ఓపెన్ చేయగా..
Oil Water Delivery
Anand T
|

Updated on: Apr 15, 2026 | 4:30 PM

Share

ప్రముఖ ఆన్‌లైన్ జెప్టో నుంచి 5లీటర్ల  ఆయిల్‌ క్యాన్ ఆర్డర్ చేసిన ఓ కస్టమర్‌కు ఆ బాటిల్‌లో ఆయిల్‌కు బదులు వాటర్ వచ్చిన ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచెర్ల , క్రాంతి కాలనీలో నివాసం ఉంటున్న శరత్ యాదవ్ అనే వ్యక్తి ఈరోజు ఉదయం జెప్టోలో 5 లీటర్స్ ఫ్రీడమ్ ఆయిల్ క్యాన్ ఆర్డర్ పెట్టాడు. అయితే పెట్టిన కొద్దిసేపటికే డెలివరీ భాయ్ వచ్చి ఆర్డర్ చేసిన ఫ్రీడమ్ ఆయిల్ కాన్ ఇచ్చి వెళ్లాడు.

ఇక వెంటే ఇంట్లో వంట చేసేందుకు కుటుంబ సభ్యులు ఆయిల్ క్యాన్ ఓపెన్ చేయగా అందులో ఆయిల్‌కు బదులు నీళ్లు కనిపించాయి. అది చూసిన కస్టమర్ ఒక్కసారిగా కంగుతిన్నాడు. వెంటనే అతను ఆర్డర్ చేసిన జెప్టో కంపెనీ వాళ్లని సంప్రదించాడు. కానీ జెప్టో సిబ్బంది నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో, సిబ్బంది, జెప్టో సర్వీస్ తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ప్రీడమ్ ఆయిల్ ఒక బ్రాండ్ అని నమ్మి తాము ఆర్డర్ చేశామని.. తీరా డెలివరీ అయ్యాక చూస్తే అందులో నీళ్లు రావడంతో ఆశ్చర్యాన్ని కలిగించిందని సదురు వినియోగదారుడు వాపోయాడు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఉపేక్షించేది లేదని.. ఈ ఘటనపై తాను కన్జ్యూమర్ కోర్టులో వెళ్తానని వినియోగదారులు చెబుతున్నాడు.ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వీడియో చూడండి..

(గమనిక: పైన పేర్కొన్న అంశాలు ఆన్‌లైన్‌ ద్వారా సేకరించిన సమాచారం మేరకు మాత్రమే అందించబడినవి. వీటిని టీవీ9 దృవీకరించడం లేదు)

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us