AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చార్మినార్ వద్ద బంగారం చోరీ కలకలం.. మహిళలకు పోలీసుల హెచ్చరిక!

Hyderabad old city crime news: ఎక్కడెక్కడి నుంచో వచ్చి చారిత్రాత్మక కట్టడమైన చార్మినార్ ను తనివితీరా సందర్శించి, ఆ పరిసర ప్రాంతాల్లో గడుపుతారు. అంతటి ప్రాధాన్యత ఉన్న చార్మినార్ ప్రాంతంలో తాజాగా బంగారం చోరీ జరగడం కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లో అత్యంత రద్దీగా ఉండే చార్మినార్ ప్రాంతంలో బంగారం దొంగతనం ఘటన ప్రజా భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తోంది.

చార్మినార్ వద్ద బంగారం చోరీ కలకలం.. మహిళలకు పోలీసుల హెచ్చరిక!
Hyderabad
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Apr 15, 2026 | 3:27 PM

Share

చార్మినార్ సాక్షిగా చోరీ ఘటనలు వెలుగుచూస్తున్నాయి. హైదరాబాద్ నగరానికే తలమానికమైన చార్మినార్ సందర్శనకు దేశ విదేశాల నుంచి తరలివస్తుంటారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి చారిత్రాత్మక కట్టడమైన చార్మినార్ ను తనివితీరా సందర్శించి, ఆ పరిసర ప్రాంతాల్లో గడుపుతారు. అంతటి ప్రాధాన్యత ఉన్న చార్మినార్ ప్రాంతంలో తాజాగా బంగారం చోరీ జరగడం కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లో అత్యంత రద్దీగా ఉండే చార్మినార్ ప్రాంతంలో బంగారం దొంగతనం ఘటన ప్రజా భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తోంది.

అసలేం జరిగిందంటే.. రెండు రోజుల క్రితం ఏప్రిల్ 12న సాయంత్రం సుమారు 7.30 గంటల సమయంలో షనాజ్ ఖదీర్ అనే మహిళ తన కూతురితో కలిసి బంగారు నగలను పాలిష్ చేయించేకునేందుకు వెళ్లింది. రాబోయే ఈద్-ఉల్-అజ్హా తర్వాత జరగబోయే తన కూతురి వివాహం కోసం ఏర్పాట్లలో భాగంగా బంగారం పాలిష్ చేయించేందుకు చార్మినార్ ప్రాంతానికి వెళ్లిన సమయంలో ఈ చోరీ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 4 తులాల విలువ గల బంగారు ఆభరణాలు (రెండు గాజులు, ఒక హారం, ఒక లాకెట్) తీసుకుని గుల్జార్ హౌస్, చార్మినార్ ప్రాంతానికి వెళ్లినట్లు బాధిత మహిళ పేర్కొన్నారు. షనాజ్ ఖదీర్ తల్హా మస్జిద్, భవానీ నగర్, తలాబ్‌కట్ట (యాకుత్‌పుర అసెంబ్లీ నియోజకవర్గం) నివాసిగా తెలుస్తోంది.

మొదట గుల్జార్ హౌస్ సమీపంలోని కరీమ్ జ్యువెలర్స్ వద్ద బంగారం పాలిష్ నిమిత్తం విచారించగా.. అక్కడ అధిక ధర చెప్పడంతో ఆమె తన బంగారం తిరిగి పర్స్‌లో పెట్టుకుని ఎదురుగా ఉన్న మసూద్ జ్యువెలర్స్ వైపు వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత పర్స్‌ను పరిశీలించగా మొత్తం బంగారం కనిపించకపోవడంతో షాక్‌కు గురై రోడ్డుపైనే మూర్చిపోయారు. స్పృహలోకి వచ్చిన అనంతరం చోరీ విషయాన్ని గుర్తించి, ఆ వెంటనే చార్మినార్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే గత రెండు రోజులుగా పలుమార్లు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి విచారించగా.. సీసీటీవీ ఫుటేజ్ స్పష్టంగా లేదని, నిందితులను గుర్తించలేకపోతున్నామని పోలీసు అధికారులు చెబుతున్నారని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో బాధిత మహిళ షనాజ్ ఖదీర్.. చోరీకి గురైన సుమారు రూ.6 లక్షల విలువైన బంగారు నగలను తిరిగి పొందేందుకు చార్మినార్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఘటనపై FIR నం. 86/2026 ను BNS సెక్షన్ 303(2) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ నాగార్జున తెలిపారు. గుల్జార్ హౌస్ పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి, బాధితురాలి సమాచారం మేరకు అనుమానితులను ప్రశ్నిస్తున్నట్లు వెల్లడించారు. అయితే.. ఈ ప్రాంతంలో తరచూ చోరీ ఘటనలు చోటు చేసుకోవడం, దొంగతనం జరిగిన అనంతరం సీసీటీవీ కెమెరాలు సరిగా పని చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మరియు చార్మినార్ జోన్ డీసీపీ తక్షణమే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ సహాయంతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అదే విధంగా చార్మినార్ ప్రాంతంలో కఠినమైన పర్యవేక్షణ, సీసీటీవీ కెమెరాలు సక్రమంగా పనిచేసేలా చర్యలు, మరియు పోలీస్ పహారా పెంచాలని కోరారు.

Follow Us
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ
విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..
ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..