ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది.. ఎన్టీఆర్‌కు విలన్‌గా ఆ స్టార్ హీరో, మరో హీరోయిన్‌గా ఈ అమ్మడు
పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరోయిన్ రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుంది.

మ్యాన్ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమా కోసం ఆయన అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తారక్ దేవర లాంటి హిట్ తర్వాత బాలీవుడ్ దర్శకుడితో కలిసి వార్ 2 సినిమా చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. దాంతో తారక్ ఫ్యాన్స్ డిస్సప్పాయింట్ అయ్యారు. దాంతో ఇప్పుడు తారక్ నటించిన సినిమా పైనే బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా జరుగుతుంది. ఈ మూవీకి డ్రాగన్ అనే పవర్ ఫుల్ టైటిల్ ను పరిశీలిస్తున్నారు. కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ కు సంబందించిన చాలా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇటీవలే తారక్ సన్నగా మారిపోవడంతో ఆయన అభిమానుల్లో రకరకాల అనుమానాలు తలెత్తాయి. ఆ అనుమానాలకు పులిస్టాప్ పెడుతూ.. రీసెంట్ గా తారక్ ఓ ఫోటోను వదిలారు. అంతే సోషల్ మీడియా మొత్తం షేక్ అయ్యిపోయింది ఆ ఫోటో దెబ్బకు.. బీస్ట్ లుక్ లో కండలు పెంచి దుమ్మురేపాడు తారక్ . దాంతో ప్రశాంత్ నీల్ సినిమా పై అంచనాలు తారా స్థాయికి చేరిపోయాయి. కాగా ఇప్పుడు ఈ సినిమాలో నటించే విలన్ గురించి అలాగే హీరోయిన్ గురించి ఆసక్తికర విషయాలు వినిపిస్తున్నాయి.
తారక్ , ప్రశాంత్ నీల్ సినిమాలో విలన్ గా బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ను అనుకుంటున్నారట. గతంలో ప్రశాంత్ కేజీఎఫ్ 2లో విలన్ గా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ను ఎంచుకున్నారు. ఇక ఇప్పుడు మరో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ను తారక్ సినిమా కోసం రంగంలోకి దింపుతున్నారట. అదేవిదంగా ఈ సినిమాలో హీరోయిన్ గా ఇప్పటికే రుక్మిణి వసంత్ ను ఫిక్స్ చేశారు.. ఆమెతో పాటు బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కూడా కీలక పాత్రలో నటించనుందని ఇన్ సైడ్ టాక్. గతంలో ఈ ఇద్దరూ కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.. త్వరలోనే దీని పై చిత్రయూనిట్ క్లారిటీ ఇవ్వనుందని అంటున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




