AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Scheme: ఎస్‌బీఐ నుంచి 2 కొత్త స్కీమ్స్.. ఏప్రిల్ 15 నుంచే అవకాశం.. కనీస పెట్టుబడి ఎంతంటే?

SBI Schemes: ఎస్‌బీఐలో రెండు కొత్త స్కీమ్‌లు రాబోతున్నాయి. గత మార్చి నెలలో మ్యూచువల్ ఫండ్స్‌లోకి రూ. 40 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. మరీ ముఖ్యంగా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. అయితే ఏ మ్యూచువల్ ఫండ్‌లోనైనా..

SBI Scheme: ఎస్‌బీఐ నుంచి 2 కొత్త స్కీమ్స్.. ఏప్రిల్ 15 నుంచే అవకాశం.. కనీస పెట్టుబడి ఎంతంటే?
Sbi Schemes
Subhash Goud
|

Updated on: Apr 15, 2026 | 3:26 PM

Share

SBI Scheme: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేవారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అనుబంధ సంస్థ అయిన ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ శుభవార్త చెప్పింది. ఎస్‌బిఐ మ్యూచువల్ ఫండ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగంలో స్వల్పకాలిక డెట్ ఇండెక్స్‌లను ట్రాక్ చేస్తూ రెండు కాన్‌స్టంట్ మెచ్యూరిటీ ఇండెక్స్ ఫండ్‌లను ప్రారంభించింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ (NFO) ఏప్రిల్ 15న ప్రారంభమై ఏప్రిల్ 20న ముగుస్తుంది. మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని తాజాగా రెండు కొత్త స్కీమ్స్‌ను (NFO) లాంచ్ చేసింది. ఈ వారం లాంచ్ అవుతున్న మొత్తం 4 ఫండ్లలో ఇవి కీలకమైనవి.

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రతి నెల కోట్లాది రూపాయలు మ్యూచువల్ ఫండ్స్ లోకి వచ్చాయి. అయితే గత మార్చి నెలలోనే రూ.40 వేల కోట్లకు పైగా కొత్తగా ఇన్వెస్ట్ చేయడమే ఇందుకు నిదర్శనం. ముఖ్యంగా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్‌లోకి వచ్చాయి. ఈ క్రమంలో ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మూలధన లాభాలను అందించేందుకు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు న్యూ ఫండ్ ఆఫర్ తో వస్తున్నాయి. ఈ వారం మొత్తం 4 కొత్త ఫండ్స్ లాంచ్ అవుతున్నాయి. అందులో రెండు లాంగ్-షార్ట్ ఫండ్స్ ఉన్నాయి. వీటి సబ్‌స్క్రిప్షన్ ఏప్రిల్ 15వ తేదీ నుంచే మొదలవుతోంది. తమ ఫోర్ట్ ఫోలియోలని ఖాళీలను పూరించడంతో పాటు దీర్ఘకాలంలో మంచి లాభాలను అందించేలా కొత్త ఫండ్స్ ను ఫండ్ హౌస్‌లు లాంచ్ చేస్తున్నాయి. ఈ స్కీమ్‌ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

ఇది కూడా చదవండి: Gold Limit Rules: బిల్లు లేకుండా ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు? చట్టపరమైన నియమాలను ఏంటి?

ఇవి కూడా చదవండి

ఎస్‌బీఐ నుంచి వచ్చిన 2 కొత్త స్కీమ్స్ ఇవే:

ఎస్‌బీఐ క్రిసిల్ ఐబీఎక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 3-6 మంత్స్ డెట్ ఇండెక్స్ ఫండ్:

  • సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం: ఏప్రిల్ 15, 2026.
  • ముగింపు తేదీ: ఏప్రిల్ 20, 2026.
  • కనీస పెట్టుబడి: రూ. 5,000.

ఎస్‌బీఐ క్రిసిల్ ఐబీఎక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 9-12 మంత్స్ డెట్ ఇండెక్స్ ఫండ్:

  • సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం: ఏప్రిల్ 15, 2026.
  • ముగింపు తేదీ: ఏప్రిల్ 20, 2026.
  • కనీస పెట్టుబడి: రూ. 5,000.
  • ఈ రెండు ఫండ్లు కూడా డెట్ ఇండెక్స్ విభాగంలోకి వస్తాయి. తక్కువ కాలవ్యవధిలో స్థిరమైన ఆదాయం కోరుకునే పెట్టుబడిదారులకు ఇవి మంచి ప్రత్యామ్నాయంగా ఉంటాయి.

పెద్ద పెట్టుబడిదారుల కోసం మరో 2 స్కీమ్స్:

కేవలం ఎస్‌బీఐ మాత్రమే కాకుండా, వెల్త్ కంపెనీ మ్యూచువల్ ఫండ్ కూడా రెండు లాంగ్-షార్ట్ ఫండ్లను లాంచ్ చేస్తోంది. ఇవి ప్రధానంగా అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టే వారి కోసం రూపొందించారు.

  • స్కీమ్స్: డబ్ల్యూఎస్ఐఎఫ్ (WSIF) ఈక్విటీ ఎక్స్ టాప్ 100, డబ్ల్యూఎస్ఐఎఫ్ ఈక్విటీ లాంగ్ షార్ట్ ఫండ్.
  • గడువు: ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 29 వరకు.
  • కనీస పెట్టుబడి: రూ. 10 లక్షలు.

ఇది కూడా చదవండి: PNB బ్యాంకులో 60 నెలల ఎఫ్‌డీలో రూ.2 లక్షలు డిపాజిట్ చేస్తే ఎంత వడ్డీ వస్తుంది?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us