Hyderabad: టిప్పర్ బీభత్సం.. ఒకరు మృతి.. నుజ్జు నుజ్జయిన నాలుగు కార్లు, రెండు బైక్ లు..
గచ్చిబౌలిలో టిప్పర్ వాహనం బీభత్సం సృష్టించింది. విప్రో చౌరస్తాలో వేగంగా దూసుకొచ్చిన టిప్పర్.. అదుపుతప్పింది. సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న నాలుగు కార్లు, రెండు బైక్‌లపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు...

గచ్చిబౌలిలో టిప్పర్ వాహనం బీభత్సం సృష్టించింది. విప్రో చౌరస్తాలో వేగంగా దూసుకొచ్చిన టిప్పర్.. అదుపుతప్పింది. సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న నాలుగు కార్లు, రెండు బైక్‌లపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. టిప్పర్ ధాటికి వాహనాలు నుజ్జునుజ్జు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారికి చికిత్స అందించేందుకు ఆస్పత్రికి తరలించారు.
మృతుడిని స్విగ్గీ డెలివరీ బాయ్ నసీర్‌గా గుర్తించారు. గాయపడిన వారిలో అబ్దుల్ అనే విద్యార్థికి కాలు విరిగిందని వైద్యులు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. టిప్పర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బ్రేకులు ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..