AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: పోగొట్టుకున్న పర్సు అమ్మాయి ప్రాణాలను కాపాడింది.. అచ్చంగా సినిమాల్లో జరిగినట్లే.

కొన్నిసార్లు నిజజీవితాల్లో జరిగే సంఘటనలు అచ్చంగా సినిమాలను తలపిస్తుంటాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్‌లో జరిగింది. ఓ యువతి పొరపాటున బస్సులో పోగోట్టుకున్న పర్సు కారణంగా ఆమె ప్రాణాలు నిలబడ్డాయి...

Hyderabad: పోగొట్టుకున్న పర్సు అమ్మాయి ప్రాణాలను కాపాడింది.. అచ్చంగా సినిమాల్లో జరిగినట్లే.
Representative Image
Narender Vaitla
|

Updated on: Dec 26, 2022 | 8:14 AM

Share

కొన్నిసార్లు నిజజీవితాల్లో జరిగే సంఘటనలు అచ్చంగా సినిమాలను తలపిస్తుంటాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్‌లో జరిగింది. ఓ యువతి పొరపాటున బస్సులో పోగోట్టుకున్న పర్సు కారణంగా ఆమె ప్రాణాలు నిలబడ్డాయి. కండక్టర్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్ద ముప్పు తప్పింది. పర్స్‌ ఏంటి.? అమ్మాయి ప్రాణాలను కాపాడడం ఏంటని.? ఆలోచిస్తున్నారు కదూ.. అయితే పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

ఆదివారం రోజు ఓ యువతి సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో బస్సు ఎక్కి సికింద్రాబాద్ జేబీఎస్‌లో దిగింది. ప్రయాణికులంతా బస్సు దిగిన తర్వాత.. రవీందర్‌ అనే కండక్టర్‌కు బస్సులో ఓ పర్సు కనిపించింది. దీంతో ఆ పర్సు ఎవరిదో అని తెలుసుకునే ఉద్దేశంతో కండెక్టర్‌ పర్సును తెరిచి చూశాడు. అందులో కొంత మొత్తంతో పాటు ఓ లెటర్‌ కనిపించింది. ఇంతకీ ఆ లేఖలో ఏముందని చదవగా.. యువతి తనకు పెళ్లి చేసుకోవడం లేదని, చనిపోవాలనుకుంటున్నానిని ఆ లేఖలో రాసి ఉంది. దీంతో వెంటనే అలర్ట్‌ అయిన కండక్టర్‌ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ దృష్టికి తీసుకెళ్లాడు.

ఆ పర్సులో ఉన్న ఆధార్‌ కార్డుతో పాటు లెటర్‌ను సజ్జనార్‌కు ట్విట్టర్‌లో షేర్‌ చేశాడు. దీంతో వెంటనే స్పందించిన ఆర్టీసీ ఎండీ.. ఆ యువతిని గుర్తించాలంటూ సిబ్బందిని ఆదేశించారు. ఆర్టీసీ ఎస్సై దయానంద్‌, మారేడ్‌పల్లి పోలీసుల సహాయంతో ఆ యువతిని గురించి కుటుంబీలకు అప్పగించారు. అనంతరం యువతికి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. సకాలంలో స్పందించి యువతి ప్రాణాలను కాపాడిన సిబ్బందితో పాటు కండక్టర్‌ రవీందర్‌ను ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ సజ్జనార్‌లు అభినందిస్తూ ట్వీట్‌ చేశారు. దీంతో ఈ సంఘటన వైరల్‌ అయ్యింది. నిజంగానే ఈ ఉదంతం సినిమాను తలపిస్తోంది కదూ!

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

గంభీర్‌ను చూసి ఎక్స్‌ప్రెషన్ మార్చేసిన కోహ్లీ..అసలు ఏం జరుగుతోంది
గంభీర్‌ను చూసి ఎక్స్‌ప్రెషన్ మార్చేసిన కోహ్లీ..అసలు ఏం జరుగుతోంది
రాత్రి వేళల్లో తినకూడని ఫ్రూట్స్ ఇవే!
రాత్రి వేళల్లో తినకూడని ఫ్రూట్స్ ఇవే!
యోగాతో గుండెపోటుకు చెక్.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన అద్భుత ఆసనాలు
యోగాతో గుండెపోటుకు చెక్.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన అద్భుత ఆసనాలు
రూ.10,000 EMIతో టాటా నెక్సాన్ కొనొచ్చు.. ఎన్నేళ్లు చెల్లించాలి?
రూ.10,000 EMIతో టాటా నెక్సాన్ కొనొచ్చు.. ఎన్నేళ్లు చెల్లించాలి?
హాట్ చాక్లెట్ తాగితే వచ్చే బెనిఫిట్స్ ఏంటో తెలుసా
హాట్ చాక్లెట్ తాగితే వచ్చే బెనిఫిట్స్ ఏంటో తెలుసా
ఆర్ఆర్ఆర్‌లో ఈ గొండు జాతి మహిళ గుర్తుందా.?
ఆర్ఆర్ఆర్‌లో ఈ గొండు జాతి మహిళ గుర్తుందా.?
హైదరాబాదులోని ఆ రోడ్డుకి డోనాల్డ్ ట్రంప్ పేరు.. ఫ్యూచర్ సిటీ రోడ్
హైదరాబాదులోని ఆ రోడ్డుకి డోనాల్డ్ ట్రంప్ పేరు.. ఫ్యూచర్ సిటీ రోడ్
శింబు, ధృవ్​ రిజెక్ట్​ చేసిన కథను ఓకే చేసిన స్టార్​ హీరో!
శింబు, ధృవ్​ రిజెక్ట్​ చేసిన కథను ఓకే చేసిన స్టార్​ హీరో!
17 సిక్సర్లు, 5 ఫోర్లతో 160..ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించాడు మామ
17 సిక్సర్లు, 5 ఫోర్లతో 160..ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించాడు మామ
మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. 48గంటల్లోనే అకౌంట్‌లో రూ.8లక్షల
మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. 48గంటల్లోనే అకౌంట్‌లో రూ.8లక్షల