Hyderabad: పాతబస్తీలో క్రైమ్ స్టోరీ.. క్లైమాక్స్‌లో సీన్ రివర్స్.. అంతా అమ్మమ్మే చేసిందట.. కారణమేంటో తెలుసా?
పాతబస్తీలో ఓ క్రైమ్ స్టోరీ క్లైమాక్స్‌లో కథ అడ్డం తిరిగింది. మనవడి అర్ధాంతర మరణంపై చర్చ రచ్చ జోరందుకుంది. అతనిది ఆత్మహత్యా? హత్యా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
పాతబస్తీలో ఓ క్రైమ్ స్టోరీ క్లైమాక్స్‌లో కథ అడ్డం తిరిగింది. మనవడి అర్ధాంతర మరణంపై చర్చ రచ్చ జోరందుకుంది. అతనిది ఆత్మహత్యా? హత్యా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కట్ చేస్తే సుపారీ డీల్ వ్యవహారం తెరపైకి వచ్చింది. హైదరాబాద్ కామటిపురాలో ఈ నెల 20న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బాసిత్ అలీ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఎంతో ఆరోగ్యంగా ఉండే బాసిత్ సడెన్ డెత్‌పై ఇరుగుపొరుగు వారు డౌట్‌పడ్డారు. నిజానిజాలు తేల్చాలంటూ డిమాండ్ చేశారు. దీంతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బాసిత్ అలీ అనుమానాస్పద మృతిని కామటిపురా పోలీసులు ఛాలెంజింగ్‌గా తీసుకున్నారు. పక్కా ఆధారాలతో బాసిత్ అలీది హత్యేనని తేల్చారు. దర్యాప్తులో ఆస్తి గొడవల్లో అమ్మమ్మ షకీరా బేగం కుట్ర కథా చిత్రమ్ రివీలైంది. ఆస్తి కోసం మనవడిని హత్య చేయించిన వైనం ఓల్డ్‌సిటీలో సంచలనం రేపింది.
ఫతే దర్వాజాలోని 500 గజాలతో పాటు మూడంతస్తుల భవనానికి సంబంధించిన అద్దె, ఆదాయం విషయంలో బాసిత్ అలీకి – అమ్మమ్మకు మధ్య గొడవలున్నాయి. ఎలాగైనా మనవడిని మట్టుపెట్టాలని స్కెచ్చేసింది. సయ్యద్ ఇర్ఫాన్, శివకుమార్, సయ్యద్ అజీమ్‌లకు సుపారీ ఇచ్చి ప్లాన్‌ను అమలు చేసింది. ఆత్మహత్య ఖాతాలో కలిపేయాలనుకున్నారు. కానీ కథ అడ్డం తిరిగింది. అమ్మమ్మ క్రైమ్ కహానీ బయటపడింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..