Telangana: ఈ బామ్మకు వింత అలవాటు..13 ఏళ్లుగా అన్నం ముట్టదు.. సుద్ద ముక్కలు మాత్రమే ఆహారం..

మల్లవ్వకు సరిగా మాటలు రావు, ఇంటి వద్దనే ఉంటుంది.. గతంలో... ఈమెను వివిధ అసుపత్రులకు తీసుకెళ్లారు. అయినప్పటికీ.. అన్నం మాత్రం తినడం లేదు. అన్నం తింటే.. వాంతులు అవుతాయనే  అనుమానంతో.. ఈ విధంగా ప్రవర్తిస్తుంది. ఇక.. కుటుంబ సభ్యులు కూడా.. చెప్పడం మానేశారు.. ఆమె కోసం.. సుద్ద ముక్కలు మాత్రం తీసుకొస్తారు. వాటిని, చిన్న, చిన్నగా కట్ చేసి. సుద్ద ముక్కలు తింటుంది.

Telangana: ఈ బామ్మకు వింత అలవాటు..13 ఏళ్లుగా అన్నం ముట్టదు.. సుద్ద ముక్కలు మాత్రమే ఆహారం..
Old Woman Stops Eating Rice
Follow us
G Sampath Kumar

| Edited By: Surya Kala

Updated on: Aug 21, 2023 | 1:01 PM

ఒక్క రోజు కాదు.. రెండు రోజులు కాదు.. ఏకంగా 13 యేళ్లుగా అన్నం ముట్టలేదు. అన్నం చూస్తేనే.. వాంతులు అవుతున్నాయంటుంది.. అంతేకాదు ఇతర.. ఆహారం కూడా.. ముట్టుకోదు. కేవలం.. సుద్ద ముక్కలు అటుకులు మాత్రమే తింటూ, కడుపు నింపుకుంటుంది. అన్నం తినకున్నా.. ఎలాంటి అనారోగ్యానికి గురి కావడం లేదు. చాలా యాక్టివ్ గా ఉంటుంది.. కుటుంబ సభ్యులు చాలా సార్లు అన్నం తినిపించేందుకు ప్రయత్నం చేశారు. కానీ, ఈమె మాత్రం తినలేదు.. అన్నం చూడగానే, భయంతో పరుగులు తీస్తుంది. దీంతో.. ఆమెకు ఇష్టమైన సుద్ద ముక్కలను ఆహారంగా అందిస్తున్నారు.

రాజన్న సిరిపిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బదనికల్ గ్రామానికి చెందిన మల్లవ్వకు. 13 యేళ్ల క్రితం.. అన్నం తింటున్నప్పుడు.. ఎవరో చూశారు. కొద్ది సేపు తరువాత.. వాంతులు అయ్యాయి. ఇక.. అప్పటి నుంచీ.. అన్నాన్ని చూడగానే వాంతులు అవుతున్నాయి. కుటుంబ సభ్యులు ఈమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ.. అన్నం ముట్టడం లేదు. డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్లినా.. మనస్సు మార్చుకోలేదు.

అయితే మల్లవ్వకు సరిగా మాటలు రావు, ఇంటి వద్దనే ఉంటుంది.. గతంలో… ఈమెను వివిధ అసుపత్రులకు తీసుకెళ్లారు. అయినప్పటికీ.. అన్నం మాత్రం తినడం లేదు. అన్నం తింటే.. వాంతులు అవుతాయనే  అనుమానంతో.. ఈ విధంగా ప్రవర్తిస్తుంది. ఇక.. కుటుంబ సభ్యులు కూడా.. చెప్పడం మానేశారు.. ఆమె కోసం.. సుద్ద ముక్కలు మాత్రం తీసుకొస్తారు. వాటిని, చిన్న, చిన్నగా కట్ చేసి. సుద్ద ముక్కలు తింటుంది. సుద్ద ముక్కలు తిన్నా. అనారోగ్యానికి గురి కావడం లేదు.. మొత్తానికి అన్నం లేకుండానే.. 13 యేళ్లుగా ఉండటంతో.. చాలా వింతగా ఉందని స్థానికులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఏదైనా ఆహారంపై ఇష్టం లేకపోతే, వాంతులు జరుగుతాయని డాక్టర్లు చెబుతున్నారు. ఈమెకు కూడా ఇలాంటి సమస్య ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఇంట్లో వంట చేయడం మానేసింది…. ఇతర ఆల్పహారాలు కూడా ముట్టుకోదు. అంతేకాదు ఈమె ఫంక్షన్లకు కూడా వెళ్లడం లేదు. సుద్ద ముక్కలు. తినడం చూసి స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఆమెను ఇంటికి పిలిస్తే.. సుద్ద ముక్కలు పెట్టాల్సిందే.. లేదంటే.. ఏం పెట్టినా తినదు. బంధువుల దగ్గరికి వెళ్తే . బంధువులు కూడా సుద్ద ముక్కలు… పెడుతున్నారు.. లేదంటే.. అటుకులు… పెడుతున్నారు.

రెగ్యూలర్ గా సుద్ద ముక్కలు తినడంతో.. కడుపు నొప్పి సమస్యలు ఉంటాయి. కానీ.. ఈమెకు మాత్రం ఎలాంటి కడుపు నొప్పి. సమస్య లేదు. మొత్తానికి.. సుద్ద ముక్కలు తినే మహిళను చూడటానికి.. చుట్టుపక్కల  గ్రామస్తులు వస్తు ఉంటారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!