- Telugu News Photo Gallery World photos World Laziness Day 2023: lazy people from all over world gathered in colombia
World Laziness Day: సోమరులకూ ఓ రోజు.. రోడ్డుపై తమ మంచాలను ఏర్పాటు చేసుకుని మరీ వచ్చి ఉత్సవాన్ని జరుపుకున్నారు..
వ్యక్తి అభివృద్ధి పథంలో పయనించాలంటే చురుకుగా పనిచేసుకోవాలి.. తెలివిగా ఆలోచించాలి.. అయితే కొందరిలో సోమరితనం ఉంటుంది. ఈ గుణం వ్యక్తుల అభివృద్ధికి పెద్ద అడ్డంకిగా మారుతుంది. తమకు సోమరితనం హానికలిగిస్తుందని తెలుసు అయినప్పటికీ సోమరితనం, బద్దకాన్ని వదిలించుకోరు. మనిషిలో చెడు గుణం గురించి ఎంత చెప్పినా తక్కువే.. అయితే సోమరితనం దినోత్సవాన్ని జరుపుకునే రోజు ఒకటి ఉంది తెలుసా..
Updated on: Aug 21, 2023 | 12:38 PM

కొలంబియాలోని ఇటాగుయ్ నగరంలో ప్రపంచ సోమరితనం దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు తమ ఉదాసీన స్థితిని చూపించడానికి.. తమ తమ మంచంపై కవాతు చేయడానికి రోడ్డుపైకి వచ్చారు.

ప్రపంచ సోమరితనం దినోత్సవాన్ని ఆదివారం కొలంబియాలో ఘనంగా నిర్వహించారు. ఈ రోజున మంచం మీద కవాతు జరిగింది. దీనిలో ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు పాల్గొన్నారు.

ప్రజలు రంగురంగుల దుస్తులలో కనిపించారు. ప్రజలు చాలా ఉత్సాహంగా, సంతోషంగా రోడ్డు మీద మంచం మీద గడిపారు. కొందరు మంచం మీద నిద్రపోతుంటే మరికొందరు బద్ధకంగా ఆస్వాదిస్తూ కనిపించారు.

1984 నుండి ప్రతి సంవత్సరం సోమరితనం దినోత్సవాన్ని వైభవంగా జరుపుకుంటున్నారు. ప్రపంచ సోమరితనం దినోత్సవం 1984లో పరిశ్రమ, వాణిజ్యం , సంస్కృతికి సంబంధించిన పండుగ ముగింపు రోజుగా మొదలు పెట్టారు.

ప్రపంచ సోమరితనం దినోత్సవాన్ని కొలంబియాలోని ఇటాగుయ్ నగరంలో తమ ఉదాసీన స్థితిని చూపించడానికి, ప్రజలు తమ మంచం మీద కవాతు చేయడానికి రోడ్డుపైకి వస్తారు.

ఈ రోజంతా ఉత్సవంలో నృత్యం, సంగీతం, థియేటర్ నాటకాలు ప్రదర్శనలు నిర్వహిస్తారు. 2012లో ప్రపంచ సోమరితనం దినోత్సవం అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది.
