Telangana: నిజామాబాద్ కానిస్టేబుల్ హత్య కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడు రియాజ్ మృతి
రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించిన నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో సంచలనం చోటుచేసుకుంది. హత్య కేసులో నిందితుడుగా ఉన్న రియాజ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం రియాజ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షల కోసం అతన్ని హాస్పిటల్‌కు తరలించగా అక్కడ రియాజ్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు.దీంతో పోలీసులు అతనిపై కాల్పులు జరిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించిన నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో సంచలనం చోటుచేసుకుంది. హత్య కేసులో నిందితుడుగా ఉన్న రియాజ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఆదివారం సారంగాపూర్ దగ్గర పట్టుబడిన రియాజ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్యపరీక్షల కోసం హాస్పిటల్‌కు తరలించారు.అయితే హాస్పిటల్ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలనుకున్న రియాజ్ కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కునేందుకు ప్రయత్నం చేశాడు.
ఈ క్రమంలో పోలీసులు రియాజ్‌పై కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో రియాజ్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో రియాజ్‌ను వెంటనే జీజీహెచ్ హాస్పిటల్‌కు తరలించారు పోలీసులు. అక్కడ రియాజ్‌ను పరీక్షించిన వైద్యులు అతడికి చికిత్స అందించారు. ఈ క్రమంలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న రియాజ్ ఇవాళ ప్రాణాలు కోల్పోయాడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




