Revanth Reddy: రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై రాజకీయ దుమారం.. రేవంత్‌పై పీడీయాక్ట్ పెట్టాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్..

ప్రగతిభవన్‌ను పేల్చేయాలన్న రేవంత్‌ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇంటా-బయట ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. పలుచోట్ల దిష్టిబొమ్మను తగులబెట్టాయి బీఆర్‌ఎస్‌ వర్గాలు. ఐనా..తగ్గేదేలే అంటూ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు రేవంత్‌రెడ్డి.

Revanth Reddy: రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై రాజకీయ దుమారం.. రేవంత్‌పై పీడీయాక్ట్ పెట్టాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్..
Revanth Reddy
Follow us

|

Updated on: Feb 08, 2023 | 8:47 PM

ప్రజలకు ప్రవేశంలేని ప్రగతిభవన్‌ ఉంటే ఎంత..? పోతే ఎంత..? నక్సలైట్లు ప్రగతిభవన్‌ పేల్చేసినా ఎవరికీ అభ్యంతరం లేదు..! ఇది రేవంత్‌రెడ్డి మంగళవారం ములుగుజిల్లాలో చేసిన హాట్‌ కామెంట్స్‌..! ఇప్పుడు ఇవే వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. టీ పీసీసీ చీఫ్‌ వివాదాస్పద వ్యాఖ్యలపై ఇంటా, బయట దుమారం చెలరేగుతోంది. ఐతే తాజాగా తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు రేవంత్‌రెడ్డి. రేవంత్‌ వ్యాఖ్యలు నక్సలైట్లను సపోర్ట్‌ చేసినట్లా..? లేక రెచ్చగొట్టినట్లా..? అని ప్రశ్నించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.

రేవంత్‌పై పీడియాక్ట్‌ నమోదు చేయాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు డీజీపీకి ఫిర్యాదు చేశారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు ఫ్రస్టేషన్‌కు నిదర్శమన్నారు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత.

ఇదే అంశంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రగతి భవన్ ను కూల్చాలని తగలబెట్టాలంటూ టెర్రరిస్టులా మాట్లాడుతున్న ఆయనపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని డీజీపీకి లెటర్ రాసినట్లు  డిమాండ్ చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడంటూ రాజాసింగ్ ను అరెస్ట్ చేసిన ప్రభుత్వం రేవంత్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.

ఇవి కూడా చదవండి

కాంగ్రెస్‌ భిన్న స్వరాలు..

అయితే కాంగ్రెస్‌ పార్టీలో దీనిపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. పక్కరాష్ట్రంలో ఉన్న పార్టీ పెద్దలు అలాంటి వ్యాఖ్యలు దురదృష్టకరమని అంటుంటే..తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు సమర్థిస్తున్నారు. మరోవైపు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నర్సంపేట, ములుగులో రేవంత్‌రెడ్డిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు బీఆర్‌ఎస్‌ నేతలు. పాదయాత్రను అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు.

అసలు రేవంత్ రెడ్డి అన్న మాటలు ఏంటంటే..

గతంలో చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి లు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ప్రజలను కలవలేదా అని ప్రశ్నించారు. ప్రజలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొడదామని ప్రజలకు పిలుపునిస్తున్నానని తెలిపారు. అవసరమైతే ప్రగతి భవన్ ను నేలమట్టం చేసే బాధ్యత తామే తీసుకుంటామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ద్రోహులకు, తన బంధువులకు మంత్రి పదవులు ఇవ్వాలని నక్సలైట్ల ఎజెండాలో ఉందా అని నిలదీశారు రేవంత్ రెడ్డి. నిరంకుశ పాలన నుంచి శాశ్వత పరిష్కారం కోసం తుది దశ ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం