‘దళిత బంధు’ పథకం పేరుకు అభ్యంతరం.. తెలంగాణ ప్రభుత్వానికి నోటిసులు..

''దళిత బంధు' పథకంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ ఎస్సీ కమిషన్ నోటిసులు జారీ చేసింది. ' 'దళిత' పదం స్థానంలో 'అంబేద్కర్' పదాన్ని...

'దళిత బంధు' పథకం పేరుకు అభ్యంతరం.. తెలంగాణ ప్రభుత్వానికి నోటిసులు..
Dalita Badhu Scheme Kcr
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 05, 2021 | 8:13 PM

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘దళిత బంధు’ పేరుపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ‘దళిత’ స్థానంలో ‘అంబేద్కర్’ పదాన్ని వినియోగించాలని మాల సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు బత్తుల రామ్ ప్రసాద్ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు జాతీయ ఎస్సీ కమిషన్‌లో పిటిషన్ దాఖలు చేశారు. దీనితో తెలంగాణ సర్కార్‌కు జాతీయ ఎస్సీ కమిషన్ తాజాగా నోటిసులు జారీ చేసింది. 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్‌ను కోరింది.

‘దళిత’ పదానికి ‘అంటరానివారు’, ‘నిస్సహాయులు’, ‘తక్కువవారు’ అనే అర్ధాలున్నాయని రామ్ ప్రసాద్ పిటిషన్‌లో పేర్కొన్నారు. కాబట్టి ఆ పేరుకు బదులుగా అంబేద్కర్ పదాన్ని వాడాలని.. పథకం పేరు ‘అంబేడ్కర్ బంధు’ మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.

కాగా, ‘దళిత’ అనే పదంపై చర్చ ఎప్పటి నుంచో జరుగుతోంది. రెండేళ్ల క్రితం బాంబే హైకోర్టులోని నాగ్‌పూర్ బెంచ్.. టీవీ ఛానెళ్లు ‘దళిత’ అనే పదానికి బదులుగా షెడ్యుల్ కాస్ట్ పదాన్ని ఉపయోగించాలంటూ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ‘దళిత్’కు బదులు షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తి’ అని పేర్కొవాలంటూ కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పట్లో సర్క్యులర్లు జారీ చేసిన విషయం విదితమే.