Sarpanch Election: వేలంలో రూ.73లక్షలకు సర్పంచ్ పదవి దక్కించుకున్న మహిళ.. కట్‌చేస్తే.. ఊహించని ట్విస్ట్
రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. అక్కడ జరిగే కొన్ని అనుకోని పరిణామాలు అభ్యర్థులకు అనందాన్ని తెచ్చిపెడితే.. మరికొందరికి నిరాషను మిగుల్చుతాయి. ఇక్కడ కూడా ఓ అభ్యర్థికి అలాంటి అనుభవమే ఎదురైంది.. వేలం పాటలో రూ.73లక్షలకు సర్పంచ్ పదవిని దక్కించుకున్న ఓ అభ్యర్థికి ఊహించని పరిణామనం ఎదురైంది. ఇంతకు ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి.

నల్గొండ జిల్లా చండూరు మండలం బంగారిగడ్డ గ్రామ పంచాయతీ మొదటి విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందుకోసం ఆశావాహులు పోటీ పడ్డారు. అయితే కొందరు గ్రామ పెద్దలు గ్రామంలో ఆగిపోయిన దేవాలయాన్ని నిర్మించాలని భావించారు. ఇందుకోసం దేవాలయ నిర్మాణానికి నిధులు ఇచ్చే వ్యక్తిని ఏకగ్రీవంగా చేయాలని ప్రయత్నించారు. ఈ క్రమంలోనే సర్పంచ్ పదవిని వేలం వేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా సర్పంచ్ పదవికి సమీనా ఖాసిం అనే మహిళా అభ్యర్థి పోటీపడ్డారు. గ్రామస్తులు నిర్వహించిన వేలం పాటలో ఏకంగా రూ.73 లక్షలకు పదవిని దక్కించుకుంది.
దీంతో సర్పంచ్ పదవికి నామినేషన్లు వేసిన ఇతర అభ్యర్థులు, ఈ వేలం ఒప్పందానికి అంగీకరించి తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇక అందరూ సమీనా ఖాసిం ఏకగ్రీవంగా సర్పంచ్ అవుతుందని అనుకున్నారు. కానీ ఎన్నికలకు కరెక్ట్‌గా వారం రోజులు ఉందనంగా అభ్యర్థితో పాటు గ్రామస్తులందరికీ ఊహించని షాక్ తగిలింది. గ్రామానికి చెందిన సతీస్ అనే వ్యక్తి గ్రామంలో ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా పదవిని వేలం వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ వేలంపాటపై జిల్లా కలెక్టర్ తో పాటు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాడు.
దీంతో రంగంలోకి దిగిన ఎన్నికల అధికారులు విచారణ చేపట్టారు. వేలం ఒప్పందం ప్రకారం అప్పటికే నలుగురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు విషయం తెలుసుకున్న మిగిలిన ఏడుగురు అభ్యర్థులు తమ నిర్ణయాన్నిమార్చుకున్నారు. దీంతో సమీనా ఖాసిం ఏకగ్రీవ ఎన్నిక అనూహ్య మలుపు తిరిగింది. ఊరికి సర్పంచ్ కావాలని ఆశపడిన అభ్యర్థి సమీనా ఖాసింకు కోరిక ఆవిరైపోయింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
