Telangana: పిల్లులే తమ పిల్లలంటున్న దంపతులు.. ఇంట్లో ఎన్ని పిల్లులను సాదుతున్నారో తెలిస్తే అవాక్కవుతారు..!

మనలో చాల మంది పిల్లిని అపశకునంగా భావిస్తుంటారు. ఏదైనా కార్యక్రమానికి, పనిమీద బయటకు వెళ్తున్నప్పుడు పిల్లి కనిపిస్తే వెంటనే ఆగి కాసేపటి తరువాత మళ్లీ బయలుదేరుతారు. అందుకే ఇంట్లో పిల్లులకు బదులుగా పెంపుడు జంతువులుగా శునకాలను మాత్రమే పెంచుకుంటారు.

Telangana: పిల్లులే తమ పిల్లలంటున్న దంపతులు.. ఇంట్లో ఎన్ని పిల్లులను సాదుతున్నారో తెలిస్తే అవాక్కవుతారు..!
Cats
Follow us
M Revan Reddy

| Edited By: Shiva Prajapati

Updated on: Jul 13, 2023 | 4:14 PM

మనలో చాల మంది పిల్లిని అపశకునంగా భావిస్తుంటారు. ఏదైనా కార్యక్రమానికి, పనిమీద బయటకు వెళ్తున్నప్పుడు పిల్లి కనిపిస్తే వెంటనే ఆగి కాసేపటి తరువాత మళ్లీ బయలుదేరుతారు. అందుకే ఇంట్లో పిల్లులకు బదులుగా పెంపుడు జంతువులుగా శునకాలను మాత్రమే పెంచుకుంటారు. ఇక కొందరు జంతు ప్రేమికులు మాత్రం తమ ఇళ్లలో ఒకటో రెండో పిల్లులను పెంచుకుంటారు. కానీ, ఇక్కడ ఓ కుటుంబం మాత్రం ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 20 పిల్లులను పెంచుతున్నారు. అంతేకాదండోయ్.. తమ పిల్లలకు నామకరణం చేసినట్టుగానే ఈ పిల్లులకు కూడా పేర్లు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఆసక్తికర వివరాలపై ఓ లుక్కేయండి మరి..

యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలో శ్రీకాంత్, దుర్గ దంపతులు ఉన్నారు. వారు నిత్యం తమ పిల్లలతో కాకుండా పిల్లులతో బిజీగా ఉంటారు. ఓసారి తల్లి చనిపోయిన పిల్లి కూన పాల కోసం ఏడుస్తూ పంది వద్ద పాలు తాగడం వీరి కొడుకు కృష్ణవంశీ గమనించాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి.. పాల కోసం తపిస్తున్న పిల్లి కూనను ఇంటికి తీసుకువచ్చి సాకడం మొదలుపెట్టారు. ఆ పిల్లి కూన పెరిగి పెద్దదై.. దాని పిల్లలు, పిల్లలకు పిల్లలు.. మొత్తం 20 వరకు సంతానం పెరిగింది. ఇలా ఎనిమిదేళ్లలో వృద్ధి చెందిన పిల్లులు ఆ ఇంటిలో సందడి చేస్తున్నాయి. తమ ఇంటికి తీసుకువచ్చి పెంచిన మొదటి పిల్లికి వీరు పెద్ద బుష్‌ అని పేరు పెట్టుకున్నారు.

తమ సంతానానికి నామకరణం చేసినట్లుగానే.. ఈ పిల్లికి జన్మించిన పిల్లలకు స్మార్టీ, సైకో, స్మార్ట్‌ బిష్యూ, బిగ్‌ బిష్యూ, టూటూ, బ్యాక్లీ, వైటా, బ్రిటీష్‌ పిల్లి అని రకరకాల పేర్లు పెట్టుకున్నారు. ఈ పిల్లులకు మూడు పూటలా భోజనం పెడుతుంటారు. పిల్లులన్నీ ఒకే దగ్గరకు వచ్చి భోజన చేస్తాయి. పిల్లుల ఆలనా పాలనా చూస్తున్న వీరు తమ పిల్లలకు మాదిరిగానే వీటికి క్రమశిక్షణ కూడా నేర్పించారు. ఇంటిలో ఎలాంటి మూత్ర, మల విసర్జన చేయకుండా బయటకు వెళ్లి రావడం నేర్పించారు. మొదట్లో ఈ కుటుంబం పిల్లులను పెంచడాన్ని చుట్టుపక్కల వాళ్లు వ్యతిరేకించారు. రాను రాను వీరి జంతు ప్రేమను వాళ్లు కూడా అర్థం చేసుకున్నారు. మానవ సంబంధాల కంటే కల్మషం లేని పిల్లుల ప్రేమే బెటర్ అని ఈ దంపతులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..