కరోనాతో దేశం మొత్తం అల్లాడుతోంది.. అయితేనేం, మన మంత్రి రోడ్డు పక్కన పూరీలు వేస్తూ సందడి చేశాడు.. ఎందుకంటే?

రాష్ట్ర ఆబ్కారీ, క్రీడలు, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ కొత్తూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా "సిత్రాలు" చేశారు. రోడ్డు పక్కన ఉన్న ఓ హోటల్‌లో పూరీలు వేస్తూ ఆకట్టుకున్నారు.

కరోనాతో దేశం మొత్తం అల్లాడుతోంది.. అయితేనేం, మన మంత్రి రోడ్డు పక్కన పూరీలు వేస్తూ సందడి చేశాడు.. ఎందుకంటే?
Minister Srinivas Goud Making Puri
Balaraju Goud

|

Apr 24, 2021 | 12:50 PM

Minister Srinivas Goud: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. ఇటు తెలంగాణలో రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే, రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.

అయితే, ఇదే క్రమంలో రాష్ట్ర ఆబ్కారీ, క్రీడలు, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ కొత్తూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా “సిత్రాలు” చేశారు. ప్రచారంలో భాగంగా ఆయన వ్యాపార వర్గాల వద్దకు వెళ్లి ఓటర్లను కారు గుర్తుకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా రోడ్డు పక్కన ఉన్న ఓ హోటల్‌లో పూరీలు వేస్తూ ఆకట్టుకున్నారు. వేడి వేడి నూనె ఉన్న బండిలో పూరీలను వేసి తీశారు. అదేవిధంగా కూరగాయల మార్కెట్ లో ఓటర్లను నేరుగా కలుసుకొని ఓటర్లను అభ్యర్థించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్.. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

Read Also….  ఐడియా ఇవ్వు.. రూ.5 లక్షలు పట్టు.. బంపర్ ఆఫర్ ప్రకటించిన కంపెనీ.. ఎప్పటివరకు ఛాన్స్ అంటే..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu