Crime News: ఆత్మహత్యే శరణ్యమనుకుంది.. ఒంటిపై పెట్రోల్పోసుకుని నిప్పంటించుకుంది
నవమాసాలు మోసి కని, పెంచి పెద్ద చేసింది. వారి ఉన్నతి కోసం సర్వం ధారపోసింది. వాళ్లే జీవితమనుకుని అన్నీ త్యాగం చేసింది. కానీ వారికి పెళ్లయి వేరే కాపురం పెట్టడంతో వారి అసలు రంగు బయటపడింది. వృద్ధాప్యంలో ఆసరాగా...
నవమాసాలు మోసి కని, పెంచి పెద్ద చేసింది. వారి ఉన్నతి కోసం సర్వం ధారపోసింది. వాళ్లే జీవితమనుకుని అన్నీ త్యాగం చేసింది. కానీ వారికి పెళ్లయి వేరే కాపురం పెట్టడంతో వారి అసలు రంగు బయటపడింది. వృద్ధాప్యంలో ఆసరాగా ఉండాల్సిన కొడుకులే.. కన్న తల్లిని ఇంట్లో నుంచి గెంటేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వృద్ధురాలు చనిపోవాలని నిర్ణయించుకుంది. స్థానికుల సహాయంతో ఆత్మహత్య(Suicide) ఆలోచనను విరమించుకుని పోలీసులను ఆశ్రయించింది. న్యాయం చేయాలని వేడుకుంది. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ లో కుమారుల వైఖరితో మరో సారి తీవ్ర ఆవేదనకు లోనైంది. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్(Petrol) ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్(Chotuppal) మండలం జైకేసారాం గ్రామానికి చెందిన బోదాసు స్వామి, ఆండాళు దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. వేరే వేరే ఊళ్లల్లో నివాసముంటున్న వీరిద్దరి మధ్య.. తల్లిదండ్రుల పోషణ విషయంలో తరచూ గొడవ జరుగుతుండేది. ఊళ్లో పెద్దలు పంచాయితీ పెట్టి బాగా చూసుకోవాలని సూచించినా వారిలో మార్పు రాలేదు.
వీరి ప్రవర్తనతో విసిగిపోయిన ఆండాళు.. వేధింపులు తట్టుకోలేకపోతున్నానని, చనిపోతానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై సర్పంచి స్పందించి, పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో ఆమె చౌటుప్పల్ పోలీసులకు ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదుతో ఇద్దరు కుమారులను పోలీసులు స్టేషన్‌కు పిలిపించి, విచారించారు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ లో జరిగిన పరిణామాలతో ఆండాళు మనస్తాపానికి గురయ్యారు. ఠాణా బయట చెట్టు చాటుకు వెళ్లి, తన వెంట సీసాలో తెచ్చుకున్న పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై.. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. జూనియర్ సివిల్ న్యాయమూర్తి నాగరాజు ఆండాళుతో మాట్లాడి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి.. అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు.
Also Read
IAF AFCAT 2022 Result: ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ 2022 ఫలితాలు విడుదల..5 రోజుల్లోపు..
Russia Ukraine War: ప్రపంచ పెద్దన్నకు కంటగింపుగా మారుతున్న భారత్ – రష్యా మధ్య మైత్రి బంధం..