Telangana News: రైతన్నకు అండగా పెద్దపులి.. పొలంలో తిష్టవేసి ఏం చేస్తుందంటే..
ఆ గ్రామానికి వెళ్తే మీకు అడుగడుగా పులులు దర్శనమిస్తాయి. ఏంటీ పులులే అని షాక్ అవుతున్నారా? అవును పులులే కానీ నిజమైనవి కాదు.. పులి రూపంలో ఉన్న బొమ్మలు. ఇంతకు ఆ గ్రామంలో పులి బొమ్ములు ఎందుకు పెట్టారు అనుకుంటున్నారా? ఇందుకు పెద్ద కథే ఉంది. అదేంటో తెలుసుకుందాం పదండి

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలో ఎటు చూసినా, ఎవరి చేతిలో చూసినా పులి బొమ్మలే కనిపిస్తున్నాయి. వీరు పులి బొమ్మలను వెంటపెట్టుకొని తిరగడానికి ప్రధాన కారణం కోతులు. ఈ గ్రామంలో కోతుల బెడద విపరీతంగా పెరిగిపోయింది. జనాలను చూస్తే చాలు కోతులు మీదకొచ్చేస్తున్నాయి. వాటికి చెక్ పెట్టేందుకే ఆ గ్రామస్తులు ఇలా పులుల బొమ్మలను వెంటపెట్టుకొని తిరుగుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఆ గ్రామంలో నాలుగు వేలకి పైగా జనాభా ఉంటుంది. ఇక్కడ అందరూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. గత ఎనిమిదేండ్ల క్రితం ఈ గ్రామంలో ఎలాంటి సమస్య లేదు. కానీ సమీప గ్రామాలలో ఉన్న కొండలు గుట్టలు గ్రానైట్ తవ్వకాలతో కాలగర్భంలో కలిసిపొయాయి. ఈ క్రమంలో కొండలు, గుట్టలు అడవి ప్రాంతాలలో ఉండాల్సిన కోతులన్నీ ఇప్పుడు గ్రామాలలోకి వచ్చి చేరిపోయాయి.
ఇప్పుడు ఈ గ్రామంలో మనుషుల జనాభా కంటే కోతుల సంఖ్యనే ఎక్కువగా ఉంది. భయటికి వెళ్ళాలంటేనే జనం భయపడుతున్నారు. ఇక్కడ ఆరుతడి పంటలు సాగు చేయడం వదిలేసారు. ఇప్పటికే ఇండ్లలన్నీంటిని పీకి పందిరి వేసాయి. గతంలో మనుషులని చూస్తే కోతులు భయపడి పరుగులు తీసేవి. కాని ఇప్పుడు కోతులను చూసి మనుషులు భయపడే పరిస్థితి నెలకొంది. ఆ గ్రామంలో కోతుల దాడిలో ఇప్పటి వరకు అరవై మందికి పైగా గాయపడ్డారుజ. కొతులని వెళ్ళగొట్టడానికి అనేక ప్రయత్నాలు చేసారు.. కాని అవి మాత్రం గ్రామంలోనే తిష్టవేస్తున్నాయి. ఈ క్రమంలో స్థానికులకి ఒక కొత్త అలోచన వచ్చింది.. కొతుల వీరాంగానికి చెక్ పెడ్టెందుకు పెద్దపులి బొమ్మలని తీసుకువచ్చి ప్రయోగించారు.
ఒక్కో పెద్దపులి బొమ్మకు మూడువేల రూపాయల వరకి ఖర్చు పెట్టి వాటిని కొనుగోలు చేసారు. ఈ గ్రామంలో సుమారుగా ఇరవై వరకి పులి బొమ్మలు ఉన్నాయి. స్థానికులు ఎక్కడికి వెళ్ళినా ఆ పులిబొమ్మలను వెంటపెట్టుకొని వెళ్తున్నారు. ఆ పులి బొమ్మను చూసి కోతులు పరుగులు తీస్తున్నాయి. వ్యవసాయ పొలాల దగ్గరికి వెళ్ళిన కూడ పులిబొమ్మలతోనే వెళ్తున్నారు. ఈ పులిబొమ్మని చూసిప కోతులు జనంపైకి రాకుండా దూరందూరంగా వెళ్తున్నాయి. ఈ పులిబొమ్మల ప్రయోగం సక్సెస్ కావడంతో మిగితావారు కూడ కొనుగోలు చేయ్యడానికి అసక్తి చూపుతున్నారు. అయితే కోతులు ఈ పులిబొమ్మకు ఎక్కువ రోజులు భయపడే అవకాశం లేదని స్థానికులు చెబుతున్నారు. ఈ పులిబొమ్మల కారణంగా మన్నెంపల్లి గ్రామస్థులు కాస్తా రిలిఫ్ అయ్యారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




